Begin typing your search above and press return to search.

మారుతి-నయన్ మధ్య అలా చెడిందా!!

By:  Tupaki Desk   |   12 July 2016 5:03 AM GMT
మారుతి-నయన్ మధ్య అలా చెడిందా!!
X
దర్శకుడు మారుతి టాలీవుడ్ లో ఓ బ్రాండ్ అయిపోయాడు. మొదట్లో బూతు సినిమాలు.. ఇప్పుడు క్లీన్ ఎంటర్టెయినర్లతో ఆడియన్స్ ని థియేటర్ల ముందు క్యూ కట్టించేస్తున్నాడు. ఇప్పటివరకు లో బడ్జెట్ చిత్రాలు.. ఒకటీ అరా మీడియం బడ్జెట్ సినిమాలు తీసిన మారుతి.. తొలిసారిగా స్టార్లతో సినిమా చేస్తున్నాడు. అదే వెంకీతో చేస్తున్న బాబు బంగారం. ఇందులో హీరోయిన్ గా సౌత్ లో టాప్ హీరోయిన్ నయనతార చేస్తోంది.

బాబు బంగారం చిత్రం విషయంలో ఇంకా కొన్ని సీన్స్ పెండింగ్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోవడానికి.. ఆడియో లాంఛ్ పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఇదే అంటున్నారు. ఆ సీన్స్ కంప్లీట్ అయితే కానీ రిలీజ్ డేట్ చెప్పలేడు.. ఇటు మళ్లీ కాల్షీట్స్ ఇచ్చేందుకు నయన్ సహకరించడం లేదనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇదంతా మూవీ ప్లానింగ్ విషయంలో వచ్చిన తేడానే అంటున్నారు. సాధారణంగా సినిమాలు తీయడం విషయంలో మారుతి చాలా ప్లానింగ్ గా ఉంటాడు. అయితే.. ఇప్పటివరకూ మారుతీ స్టార్ హీరో హీరోయిన్లతో సినిమాలు తీయలేదు.

రేష్మ-నందిత-రెజీనా-లావణ్య త్రిపాఠి.. ఇలా మారుతి హీరోయిన్స్ అందరూ అప్పటికి పెద్దగా క్రేజ్ లేని వారే. అందుకే డేట్స్ కొంచెం తేడా వచ్చి.. అదనంగా అడిగినా కాదనే పరిస్థితి లేదు. కానీ నయన్ విషయంలో అలాకాదు. హైయెస్ట్ డిమాండ్ హీరోయిన్స్ లో ఆమె ఒకరు. తన డేట్స్ అప్పట్లో వేస్ట్ అయ్యాయనే ఫీలింగ్ తోనే ఇలా బెట్టు చేస్తోందట. మరి ఈ ఇష్యూని మారుతీ ఎలా సాల్వ్ చేసుకుంటాడో అనుకుంటున్నారు. మరోవైపు స్టార్లను డైరెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి కేర్ ఉండాలో కూడా ఈ దర్శకుడికి అనుభవంలోకి వచ్చేసినట్లే.