Begin typing your search above and press return to search.
మారుతి సినిమానా మజాకా
By: Tupaki Desk | 1 March 2016 11:56 AM GMTదాసరి మారుతి మొదట్లో తీసిన సినిమాల్ని దృష్టిలో ఉంచుకుని అతడిపై ఇండస్ట్రీలో ఇంకా కొంచెం చిన్న చూపు ఉంది కానీ.. టాలీవుడ్లో అద్భుతమైన సక్సెస్ రేట్ ఉన్న దర్శకుల్లో అతనొకడు. ఇప్పటిదాకా అతడి కెరీర్లో ఫెయిల్యూర్ అన్నదే లేదు. ఒక్క ‘కొత్తజంట’ మాత్రమే పెట్టుబడికి సమానంగా వసూలు చేసింది. మిగతా సినిమాలన్నీ కూడా పెట్టుబడి మీద కనీసం రెండు రెట్లు రాబట్టినవే. ముఖ్యంగా మారుతి లాస్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’ అయితే స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఏకంగా రూ.50 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో మారుతి సినిమా అంటే బయ్యర్లలో చాలా మంచి క్రేజ్ వచ్చేసింది.
ఈ ప్రభావం మారుతి తర్వాతి సినిమా ‘బాబు బంగారం’ మీద కూడా బాగానే కనిపిస్తోంది. సీనియర్ హీరో వెంకటేష్ మార్కెట్ గత కొన్నేళ్లలో బాగా పడిపోయింది. ‘దృశ్యం’ లాంటి ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా రూ.20 కోట్ల లోపే కలెక్షన్లు తెచ్చుకుంది. ఐతే మారుతితో జట్టు కట్టేసరికి ‘బాబు బంగారం’కు మాంచి క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాకు క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యే యుఎస్ రైట్స్ రూ.2.2 కోట్లకు అమ్మినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన ‘గోపాల గోపాల’ను పక్కనబెడితే.. వెంకీ సోలో సినిమాలేవీ కూడా కనీసం కోటి రూపాయలు కూడా తెచ్చుకోలేకపోయాయి అక్కడ. అలాంటిది ఒక్కసారిగా రూ.2.2 కోట్లంటే మాటలు కాదు.
ఇదంతా ‘భలే భలే..’ వల్ల వచ్చిన క్రేజ్ వల్లే. ఆ సినిమా అక్కడ ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం ‘బాబు బంగారం’కు క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.