Begin typing your search above and press return to search.
మారుతి: ఏక్ దిన్ కా డైరెక్టర్
By: Tupaki Desk | 1 Aug 2018 1:30 AM GMTమారుతి మిగతా డైరెక్టర్లలా తన సినిమాకు మాత్రమే కథ - స్క్రీన్ ప్లే రాసుకోవడమే కాకుండా ఇతర సినిమాలకు కథ - స్క్రీన్ ప్లే అందిస్తాడు. అలా కథ అందించిన సినిమానే 'బ్రాండ్ బాబు'. సుమంత్ శైలేంద్ర ఈ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ హీరో ఎవరంటే రాజ్ తరుణ్ సినిమా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' నిర్మాత శైలేంద్ర బాబు కుమారుడు. ఇదేమీ సుమంత్ శైలేంద్ర కు మొదటి సినిమా కాదు.. కన్నడలో ఆల్రెడీ నాలుగు సినిమాలు చేశాడట.
'బ్రాండ్ బాబు' ఆగష్టు 3 న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు 'బ్రాండ్ బాబు' టీమ్. హీరో సుమంత్ శైలేంద్ర ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా నిజానికి మారుతి దర్శకత్వంలో తెరకెక్కవలసిందట. కానీ మారుతి ఇతర కమిట్మెంట్ల కారణంగా ఈ సినిమా పట్టాలెక్కేందుకు రెండేళ్ళు పట్టేలా ఉండడంతో ఈటీవీ ప్రభాకర్ కు దర్శకత్వ భాద్యతలు అప్పగించారట.
కానీ ఈ సినిమాకు మారుతి ఒక రోజు మెగాఫోన్ చేపట్టి డైరెక్షన్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. డైరెక్టర్ ప్రభాకర్ కు ఒక రోజు పర్సనల్ ఎమర్జెన్సీ రావడంతో మారుతి ఆరోజు డైరెక్ట్ చేయడం జరిగిందట. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అది ఇంటర్వెల్ సీన్ అట. సుమంత్ శైలేంద్ర ఇప్పటి వరకూ కన్నడ సినిమాలే చేసిన ఇకపై తన దృష్టి అంతా తెలుగు పైనేనని అంటున్నాడు.