Begin typing your search above and press return to search.

మారుతి ల‌క్‌, హ‌రీష్ బ్యాడ్ ల‌క్‌

By:  Tupaki Desk   |   29 Sep 2015 5:30 PM GMT
మారుతి ల‌క్‌, హ‌రీష్ బ్యాడ్ ల‌క్‌
X
ఏ ద‌ర్శ‌కుడి ఫేట్ ఎలా ఉందో డిసైడ్ చేసేది హిట్టు మాత్ర‌మే. ఎవ‌రు ల‌క్కీ, ఎవ‌రు అన్‌ల‌క్కీ అనేది తేల్చేది ఆ సినిమా సాధించే వ‌సూళ్లే. ఇక్క‌డ బాక్సాఫీస్ లెక్క‌లే డిసైడ్ చేసేది. ఆ ర‌కంగా చూస్తే ఓ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే. స్టార్ డైరెక్ట‌ర్ హోదా అందుకున్న హ‌రీష్ శంక‌ర్‌ - అప్‌ క‌మ్ డైరెక్ట‌ర్‌ గా పేరు తెచ్చుకున్న మారుతి.. ఈ ఇద్ద‌రినీ పోలిస్తే ఇందులో మారుతినే ల‌క్కీ డైరెక్ట‌ర్‌ గా వెలిగిపోతున్నాడు. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకి వెళితే..

మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఇటీవ‌లే రిలీజై - ఇంటా బైటా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఆ సినిమా తెలుగు రాష్ర్టాల్లో అసాధార‌ణ విజ‌యం సాధించింది. అలాగే అమెరికాలోనూ భారీ విజ‌యం సాధించింది. అక్క‌డ 6.1 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ రిలీజైంది. అయితే సుబ్ర‌మ‌ణ్యం ప‌ప్పులు లోక‌ల్‌ గా ఉడికిన‌ట్టు ఓవ‌ర్సీస్‌ లో ఉడ‌క‌లేదు. ఫ‌లితం అమెరికాలో కేవ‌లం 80ల‌క్ష‌ల నుంచి 1 కోటి (రాబోవు వ‌సూళ్లు క‌లుపుకుని) లోపు వ‌సూళ్లు మాత్ర‌మే ద‌క్కిన‌ట్టు. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల పారితోషికం అమెరికా వ‌సూళ్ల‌పైనే డిపెండ్ అయి ఉంద‌ని చెబుతున్నారు. ఆ ర‌కంగా హ‌రీష్ కంటే మారుతినే లాభ‌ప‌డిన‌ట్టు.

మారుతి - హ‌రీష్ త‌మ రెమ్యున‌రేష‌న్‌లో 75 శాతం నెట్ క్యాష్ తీసుకున్నా, మిగ‌తా 25 శాతం అమెరికాలో సినిమా పంపిణీ హ‌క్కుల రూపంలో ద‌క్కించుకున్నారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అమెరికా రిలీజ్‌ హ‌క్కుల్ని నాని - మారుతి సంయుక్తంగా తీసుకున్నార‌నుకున్నా.. అందులో 1/3 మారుతికి అనుకున్నా అత‌డికి దాదాపు 2కోట్లు చేతికి అందిన‌ట్టు. దాంతో పోలిస్తే హ‌రీష్ శంక‌ర్ వాటా కేవ‌లం 30ల‌క్ష‌లు ఉంటుంది అంతే. మారుతి ల‌క్‌, హ‌రీష్ బ్యాడ్ ల‌క్‌!