Begin typing your search above and press return to search.

మారుతి లవ్ స్టోరి మొదలైంది

By:  Tupaki Desk   |   18 Jan 2018 2:30 AM GMT
మారుతి లవ్ స్టోరి మొదలైంది
X
దర్శకులందరిది ఒక రూట్ అయితే డిఫెరెంట్ పాయింట్ తో కథను అల్లే మారుతిది మరో దారి. అతను తీసే సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ముఖ్యంగా బిసి సెంటర్లలో లో మనోడి కామెడీ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అక్కడే అసలు వసూళ్లు క్రియేట్ అవుతాయి. అయితే ఎక్కువగా మారుతి రిస్క్ చేయకుండా ఓ మీడియం మార్కెట్ రేంజ్ లోనే తన సినిమాలను తెరకెక్కిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుంటాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. మహానుభావుడు లాంటి మంచి హిట్ తరువాత మారుతి ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య తో ఒక సినిమాను ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన మొదటి ఆనవాలును సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. సినిమా అరోగెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఇన్ఫో ని తన ట్విట్టర్ ద్వారా తెలియనేస్తూ.. ఫైనల్ గా సినిమా స్టార్ట్ అయ్యిందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

సినిమాను కొన్ని నెలల క్రితమే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల షూటింగ్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాల తరువాత సెట్స్ పైకి వెళుతోంది. మారుతి మొత్తం స్క్రిప్ట్ పనులను రీసెంట్ గా ఫినిష్ చేసి సినిమా షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడు. శైలజా రెడ్డి అల్లుడు అని ఈ సినిమాకు టైటిల్ ను కూడా సెట్ చేశారు. శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ కనిపించనుంది. మరి ఈ సినిమా చైతుకు ఎంతవరకు విజయాన్ని ఇస్తుందో చూడాలి.