Begin typing your search above and press return to search.
అలా చెయ్యడం మారుతికి ఈసారి కుదరదేమో!
By: Tupaki Desk | 31 Dec 2019 1:26 PM GMTఈమధ్య రిలీజ్ అయిన సాయి ధరమ్ తేజ్ సినిమా 'ప్రతిరోజూ పండగే' తో దర్శకుడు మారుతికి మంచి హిట్టు లభించింది. పోటీలో మరో చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద జోరుగా కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ఈ సినిమా విజయంతో దర్శకుడు మారుతి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా తర్వాత మారుతి నెక్స్ట్ సినిమా గురించి కూడా ఆసక్తి వ్యక్తం అవుతోంది.
మారుతి తదుపరి చిత్రం ఇప్పటికే ఫిక్స్ అయింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ ను ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మారుతికి కత్తిమీద సాములా ఉండబోతోందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈమధ్య స్టార్ కిడ్స్ ను పరిచయం చేస్తూ తెరకెక్కిన సినిమాలలో దాదాపు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. ఒక్కటంటే ఒక్క స్టార్ కిడ్ డెబ్యూ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.. సాలిడ్ హిట్ నమోదు కాలేదు. రొటీన్ లవ్ స్టోరీలతో.. అరిగిపోయిన కమర్షియల్ మీటర్లో సినిమాలను చుట్టేయడం దీనికి ముఖ్య కారణం. దీంతో ఈ ప్రెజర్ తప్పనిసరిగా మారుతిపై ఉంటుంది.
మరో విషయం ఏంటంటే మిగతా నిర్మాతలకు దానయ్యకు ఒక తేడా ఉందని.. దానయ్య తన సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ కాడని ఇన్సైడ్ టాక్. అత్తెసరు కథలు.. ఒక సన్నని థ్రెడ్ పై రెండున్నర గంటల లవ్ స్టోరీని సాగదీయడం లాంటి వాటికి దానయ్య ఒప్పుకోరని అంటున్నారు. మారుతికి ఇదే అసలు సిసలు పరిక్ష.. ఎందుకంటే మారుతి ఈమధ్య దర్శకత్వం వహించిన సినిమాల కథలలో అధికభాగం ఇలాంటివే. మరి ఇలాంటి యావరేజ్ కథలతో దానయ్యను మారుతి ఎలా ఒప్పిస్తాడో అని చాలామంది అంటున్నారు. కొంతమంది మారుతి సన్నిహితులు కొందరు ఈ విషయంలో జాగ్రత్తలు చెప్తున్నారట. ఇతర నిర్మాతల దగ్గర చేసినట్టు చేస్తే కుదరదని.. కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారట. చూద్దాం మారుతి ఈ టెస్టు అలా పాస్ అవుతారో.