Begin typing your search above and press return to search.

లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తోన్న మారుతి

By:  Tupaki Desk   |   30 Sep 2017 7:24 AM GMT
లేడీ ఓరియెంటెడ్ మూవీ తీస్తోన్న మారుతి
X
మహానుభావుడు హిట్ తో మారుతికి అవకాశాల వెల్లువ ఎక్కువైందనే న్యూస్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మారుతికి కంగ్రాట్స్ చెప్పేందుకు వచ్చిన ప్రతి హీరోతో త్వరలోనే సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాటిలో అంతో కుంతో నిజం లేకపోలేదని అంటున్నారు. హారికాహాసని క్రియేషన్స్ పతాకం పై అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి డైరెక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసింది. అలానే మరో అక్కినేని హీరో అఖిల్ తో మారుతి సినిమా ఉంటుందని చెబుతున్నారు.

కానీ చైతూ సినిమాలోనే అఖిల్ ఓ కీలక పాత్ర పోషిస్తాడని సమాచారం. అంటే మనం తరువాత చైతూ - అఖిల్ కలిసి నటిస్తోన్న రెండో సినిమాను మారుతి డైరెక్ట్ చేయబోతున్నాడు అన్నమాట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందని తెలిసింది. అయితే దీంతో పాటే మారుతి తన ఓన్ బ్యానర్ మారుతి టాకీస్ పై ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగమ్మాయిలు స్వాతి లేక అంజలి హీరోయిన్లుగా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. బాలీవుడ్ మూవీ హైవే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ఈ సినిమాతో ఓ నూతన దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడట మారుతి. హైవే ఒరిజనల్ వెర్షన్ లో అలియభట్ హీరోయిన్ - రణ్ దీప్ కీలక పాత్ర పోషించాడు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోతమొగించింది. మరి తెలుగు ప్రేక్షకులు ఈ కథను ఎంతవరుకు ఆదిరిస్తారో చూద్దాం.