Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఒకే
By: Tupaki Desk | 6 Oct 2017 5:30 PM GMTపవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు రాజకీయాల్లో కొన్ని మార్పులు వచ్చాయనే చెప్పవచ్చు. తన సొంత పార్టీ స్టామినా ఎంతో తెలియకున్నా పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో అయన జనసేన వల్ల ఎంతో కొంత మార్పులు జరగవచ్చని కొందరు అంటుంటే మరికొందరు ఆయన వల్ల ఇతరులకు లాభం కానీ ఆయనకు లాభం చేకూరదని అంటున్నారు.
సినిమా ఇండస్ట్రిలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పవన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. అయన రాజకీయాల్లోకి వస్తే ఎంతో కొంత మార్పు రావచ్చు అనేవిధంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పెదవి విరిచినవారు కూడా ఉన్నారులే. అయితే రీసెంట్ గా దర్శకుడు మారుతీ కూడా పవన్ కళ్యాణ్ జనసేనకు టెక్నీకల్ ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను అంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో జనసేనపై మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''నాకు రాజకీయాల గురించి అంతగా తెలియదు. నా ఆలోచన ఎప్పుడు సినిమాలపైనే ఉంటుంది. అదే నా ప్రపంచం. సినిమాకి సంబందించిన వాటి గురించి తప్ప.. పక్కవాటి గురించి నేను ఆలోచించాను. అయితే జనసేన పార్టీకి ఏదైనా టెక్నీకల్ సాయం చేయమని కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే చేస్తాను' అని మారుతి వివరించాడు.
గతంలో మనోడు ప్రజారాజ్యం పార్టీ కోసం కొన్ని వీడియోలను క్రియేట్ చేయడంలో కీలకపాత్రను పోషించాడులే. అందుకే మనోడ్ని ఇప్పుడు అందరూ జనసేన కోసం ఏమైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు. అది సంగతి.