Begin typing your search above and press return to search.

మారుతికి ఇంకెవ్వరూ దొరకలేదా?

By:  Tupaki Desk   |   6 April 2016 3:30 PM GMT
మారుతికి ఇంకెవ్వరూ దొరకలేదా?
X
విక్టరీ వెంకటేష్-దాసరి మారుతి కాంబినేషన్ లో రెండేళ్ల కిందటే ఓ సినిమా రావాల్సింది. కానీ మారుతి మీద నమ్మకం కుదరక ‘రాధ’ సినిమాను ప్రారంభోత్సవం కూడా అయ్యాక ఆపించేశాడు వెంకీ. ఐతే ‘భలే భలే మగాడివోయ్’తో తనేంటో ప్రూవ్ చేసుకుని మళ్లీ వెంకీ నుంచి పిలుపు అందుకున్నాడు మారుతి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘బాబు బంగారం’ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ పూర్తి కాకముందే బిజినెస్ కూడా అయిపోయింది. సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడితే.. మారుతి రేంజే మారిపోతుంది. వెంకీ లాగే మిగతా స్టార్ హీరోలు కూడా పిలిచి మరీ మారుతికి ఛాన్సిచ్చే అవకాశాలున్నాయి.

ఐతే మారుతి మాత్రం ఎవ్వరూ ఊహించని ఓ హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘నువ్విలా’ సినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత జీనియస్ - రామ్ లీలా లాంటి కళాఖండాల్లో నటించిన హవీష్ తో మారుతి తన తర్వాతి సినిమాకు కమిటైనట్లు సమాచారం. హవీష్.. కేఎల్ యూనివర్శిటీ అధినేత కొడుకు. బ్యాగ్రౌండ్ గట్టిగా ఉండటంతో అతణ్ని హీరోగా నిలబెట్టడానికి ఎంత కావాలన్నా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జీనియస్ - రామ్ లీలా లాంటి సినిమాల మీద ఇప్పటికే కోట్లు పోశారు. అయినా ఫలితం రాలేదు. ఇక లాభం లేదని.. మారుతిని ట్రై చేశారు. భారీగా పారితోషకం ఆఫర్ చేయడంతో మారుతి ఓకే అనేసినట్లు సమాచారం. ఐతే కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో మారుతి ఇలాంటి హీరోతో సినిమా చేయడం కరెక్టా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ తో సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని చెప్పుకున్న మారుతి.. ఆ లక్ష్యం దిశగా అడుగేయకుండా ఇలా బ్యాక్ స్టెప్ తీసుకున్నాడేంటో?