Begin typing your search above and press return to search.
మహానుభావుడు అఖిల్ అయితే!
By: Tupaki Desk | 28 Sep 2017 5:43 PM GMTఈ రోజుల్లో సాధారణ కథలు జనాల్లోకి ఎక్కాలంటే చాలా అదృష్టం ఉండాలి. హిట్ అవ్వచ్చు.. అవ్వకపోవచ్చు. అలా తీయడం కన్నా ఈ రోజుల్లో నడిచే అంశాలనే కరెక్ట్ గా తెరకెక్కిస్తే మంచి హిట్ అందుకోవచ్చు. డైరెక్టర్ మారుతి కూడా అదే చేశాడు. ఈ రోజుల్లో లాంటి అడల్ట్ కామెడీలతో సినిమాలు తీసి ఓ రేంజ్ కు వచ్చాక.. తన అసలు టాలెంట్ ని చూపించి కామెడీ కథలతో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు.
ఇప్పుడు మరొక కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. అతి శుభ్రత అనే లక్షణం చుట్టు ఒక కథను రాసుకొని శర్వతో మహానుభావుడు అనే సినిమాను తీశాడు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి మారుతి కొన్ని విషయాలను తెలిపాడు. మహానుభావుడు కథని నాలుగేళ్ల క్రితమే రాసుకున్నాడట. అసలైతే మొదట ఈ సినిమాను అఖిల్ తో చేయాలని భావించాడట. అప్పట్లో స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా జరిగాయట. బడ్జెట్ విషయంలో కూడా ఓకే అనుకున్నా.. ఎందుకో ఆ ప్రాజెక్టు కుదరలేదని.. ఆరంభానికి నోచుకోలేదని చెప్పాడు ఈ డైరెక్టర్. చాలా మంది చేసిన పనిని పదే పదే చేస్తుంటారు. మనిషికి అనేక లక్షణాలు ఉంటాయి అందులో అతి శుభ్రత ఎక్కువగా ఉండే మనుషులు కూడా ఉంటారు. సో అలాంటి కోణంలో నుంచి ఈ కథ పుట్టిందని దర్శకుడు వివరించాడు.
శర్వా గురించి చెబుతూ.. ఇప్పటివరకు తాను తీసిన సినిమాల్లోని క్యారెక్టర్ ని ప్రతి ఒక్కరు వారి వారి స్టైల్ లో చేశారు. కానీ శర్వా ఒక్కడే కథ వినగానే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. మంచి టైమింగ్ తో కామెడీ చేశాడని చెప్పారు. ఇక గత చిత్రం బాబు బంగారం గురించి స్పందిస్తూ.. ఆ సినిమాను అనుకున్నట్టుగా ప్రెజెంట్ చేయలేకపోయామని. ఆ సినిమా స్క్రిప్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్ అని వివరించారు. ఇక నెక్స్ట్ సినిమాని నాగ చైతన్య తో తీయబోతున్నట్లు చెప్పిన మారుతి..ఆ సినిమాలో మంచి లవ్ స్టోరితో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని అన్నాడు