Begin typing your search above and press return to search.

నాలోంచి ఒక్కో కోణం బైటికి తీస్తా-మారుతి

By:  Tupaki Desk   |   8 Oct 2015 5:20 AM GMT
నాలోంచి ఒక్కో కోణం బైటికి తీస్తా-మారుతి
X
వరుస విజయాలతో స్పీడ్‌ మీద ఉన్నాడు యంగ్‌ డైరెక్టర్‌ మారుతి. అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. అయితే ఇది సమర్థత వల్లే సాధ్యమవుతోందని అంతా నమ్ముతున్నారని చెబుతున్నాడు మారుతి. భలే భలే మగాడివోయ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడం తన కెరీర్‌ నే మార్చేసిందని అంటున్నాడు. ఈ రోజు మారుతి పుట్టినరోజు సందర్భంగా అతడు చెప్పిన హైలైట్స్‌...

=సినిమా ఫర్వాలేదు. హిట్టవుతుంది అనుకున్నాం కానీ ఇంత పెద్ద హిట్టవుతుందని ఊహించలేదు. నాని క్యారెక్టర్‌ జనాలకు బాగా కనెక్టయ్యింది. అందులో కొత్తదనం ఆకట్టుకుంది. మతిమరుపు నానికే కాదు చాలామందికి రియల్‌ గానే ఉంది.. ఆ క్యారెక్టర్‌ లో చూసుకుని రిలేటయ్యారంతా. నేను నమ్మింది అంతమంది అంగీకరించారు.

=నేను చూసిన పర్సనల్‌ అనుభవాలు.. కథ ప్రకారం కొన్ని పుట్టుకొచ్చినవి .. అన్నీ అస్సెట్‌ అయ్యాయి.

హీరో క్యారెక్టరైజేషన్‌ అనుకున్నప్పుడు నానినే ఊహించుకుని రాసుకున్నా. అలాగే లావణ్య త్రిపాఠి క్యారెక్టర్‌ కూడా. ఆర్టిస్ట్‌ బాడీ లాంగ్వేజ్‌ కి తగ్గట్టు రాసుకుని, ఆర్టిస్టు ఓన్‌ చేసుకుని నటిస్తే ఆ లెక్కే వేరు.

=సినిమా ఆడుతుందా లేదా అన్నది అస్సలు ఆలోచించను. నాకు వచ్చిన థాట్‌ ని డెవలప్‌ చేస్తానంతే. వాస్తవానికి ఈ సినిమాకి రెండు కథలు నా దగ్గర ఉన్నాయి. ఆ రెండిటిలోనూ నాని క్యారెక్టరైజేషన్‌ ఉంది. అసలు ఏ కథలోకి అయినా నాని క్యారెక్టర్‌ ని ప్రవేశపెట్టవచ్చు. పాత్రలో కాన్‌ ఫ్లిక్ట్‌ కనెక్టవుతుంది. ఈ పాత్ర ఏం మరిచిపోతాడు. ఎలా సమస్యను అధిగమిస్తాడు? అన్నది ఎవరికైనా నచ్చుతుంది.

=ఓవర్సీస్‌ అసలు ప్లాన్డ్‌ కాదు. సినిమా చూశాక నా స్నేహితుడు ఓవర్సీస్‌ బిజినెస్‌ ట్రై చేస్తున్నాడు. నాకు నమ్మకం ఉంది. ఇద్దరం చేయాలనుకున్నాం. ఓవర్సీస్‌ లో వసూళ్లు షాకింగ్‌. అక్కడ 50రోజులు ఆడడం అనేది లేనేలేదు. 50డేస్‌ కొన్ని కేంద్రాల్లో పడుతోంది. వేరే సినిమాలు వచ్చినా ఈ సినిమాని తీసెయ్యడం లేదు. అమెరికా వెళ్లినప్పుడు అందరూ బాగా రిసీవ్‌ చేసుకున్నారు. అక్కడ నైజాం సెంటర్‌ ఎలా ఉంటుందో అలానే ఉందక్కడ. ఓ పెద్ద నైజాం సెంటర్‌ అది. ఓవర్సీస్‌ అనేది పెద్ద అఛీవ్‌ మెంట్‌ అని నాకు తెలీదు. ఏదో 10లక్షలు వచ్చినా చాలు అనుకుని చేశాను. ఊహించనంత విజయం దక్కింది.

=చేసేసిన జోనర్‌ లో కథను మళ్లీ చేయను. నేను చేయాల్సిన కథలు చాలానే ఉన్నాయి. కథ లేకపోతే సీక్వెల్స్‌ ఆలోచిస్తానేమో.

=ఈరోజుల్లో - బస్‌స్టాప్‌ ఒక జోనర్‌. ప్రేమకథా చిత్రమ్‌ వేరొక జోనర్‌ - కొత్త జంట వేరు. నానితో సినిమా వేరు. ఒకే జోనర్‌ లో సినిమాలు చేయాలని లేదు. అన్నిజోనర్‌ లు చేస్తాను. తీయలేను అనుకున్న జోనర్‌ లేదు. నాలో చాలా కోణాలు ఉన్నాయి. ఒక్కొకకటి బైటికి తీస్తా.

=ఆన్‌ సెట్స్‌ స్క్రిప్టును తప్పకుండా డెవల్‌ చేయాల్సిందే. సన్నివేశాల్ని అవసరం మేర నటీనటుల సాయంతో అభివృద్ధి చేస్తాం. సినిమా అనేది టీమ్‌ వర్క్‌. నటీనటుల పెర్ఫామెన్స్‌ నుంచి బెస్ట్‌ ఔట్‌ పుట్‌ తీసుకోగలగడమే దర్శకత్వం. ప్రాజెక్టును - 24 శాఖల్ని పూర్తిగా అదుపులో ఉంచుకుని పనిచేయగలిగేది దర్శకుడు. దారి తప్పి వెళ్ల కుండా చూసుకోవాలి. నేను ఆ పని సమర్థంగా చేస్తున్నా.

=రాజ్‌ తరుణ్‌ తో ప్రస్తుతం ఓ సినిమా నిర్మిస్తున్నా. వేరొక పెద్ద సంస్థతో కలిసి ఈ సినిమా చేస్తున్నా. ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది. అలాగే నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాకి క‌థ రాసుకుంటున్నా. ఎవ‌రు హీరో అనేది త‌ర్వాత చెబుతాను.

=ఇప్పుడు నన్ను అందరూ నమ్ముతున్నారు. వరుస విజయాల తర్వాత బోలెడన్ని ఆఫర్లు. అయితే చిన్న సినిమా బతకాలి. అప్పుడే అందరికీ ఉపాధి.