Begin typing your search above and press return to search.
మారుతి ఈసారి ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో!
By: Tupaki Desk | 13 Jun 2019 2:16 PM GMTయూత్ కి కనెక్టయ్యే బర్నింగ్ టాపిక్ ని ఎంపిక చేసుకుని దానిపై సినిమాను రన్ చేయడంలో యంగ్ డైరెక్టర్ మారుతి స్పెషలిస్ట్. ఎంచుకునే కథ- కాన్సెప్టు కచ్ఛితంగా యువతరానికి కనెక్ట్ చేయడం అతడి పద్ధతి. ఇదివరకూ మతిమరుపు .. ఓసీడీ అనే కాన్సెప్టులతో సినిమాలు తీసి ఆకట్టుకున్నాడు. నాని- భలే భలే మగాడివోయ్ మతిమరుపు నేపథ్యంలో వచ్చి బ్లాక్ బస్టర్ కొడితే .. శర్వా- మహానుభావుడు ఆశించినంతగా బాక్సాపీస్ వద్ద వర్కవుటవ్వలేదు. అయితే ఈ రెండు సినిమాలకు ఎంచుకున్న పాయింట్ పై జనాల్లో చర్చ సాగింది.
ప్రస్తుతం సాయిధరమ్ హీరోగా తీస్తున్న సినిమాకి మారుతి ఎలాంటి కథను ఎంచుకున్నారు అన్నది హాట్ టాపిక్. మరోసారి మారుతి ఎంచుకున్న కథ యువతరంలో హాట్ టాపిక్ అవుతుందా అన్నది వేచి చూడాలి. అయితే ఇందులో కథానాయిక రోల్ గురించి ఓ లీక్ అందింది. ప్రస్తుతం యువతరంలో టిక్ టాక్ అనేది హాట్ టాపిక్. టిక్ టాక్ లో వీడియోలో షేర్ చేసే కథానాయిక వల్ల ఎలాంటి కామెడీ పుట్టింది? ఎలాంటి చిక్కులు వచ్చి పడ్డాయి? అన్నది ఆ పాత్రకు ఆపాదించారట మారుతి.
అయితే మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు చేసిన సాయిధరమ్ పాత్ర ఎలా ఉండబోతోంది? అతడి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే మారుతి ఆ పాత్రను తీర్చిదిద్దారా? ఎంచుకున్న మెయిన్ థీమ్ ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రానికి `ప్రతి రోజూ పండుగే` అనే టైటిల్ ఇప్పటికి వినిపిస్తోంది. అయితే దానిని అధికారికంగా టీమ్ ప్రకటించలేదు. కథానాయికగా రెజీన పేరు వినిపిస్తున్నా వేరొక టాప్ రేంజ్ బ్యూటీని ఎంచుకోవాలన్న ఆలోచన మారుతికి ఉందట. 2020 సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా హార్డ్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్2- యు.వి క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రలహరి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది కాబట్టి ఈసారి బ్లాక్ బస్టర్ కోసం సాయిధరమ్ వెయిటింగ్. అలాగే మారుతికి ఇది ఎంతో ఇంపార్టెంట్ మూవీ అన్న సంగతి తెలిసిందే.