Begin typing your search above and press return to search.

ఫీల్ గుడ్ సాంగుతో టెన్షన్‌ పడుతున్నాడే

By:  Tupaki Desk   |   9 July 2016 4:21 AM GMT
ఫీల్ గుడ్ సాంగుతో టెన్షన్‌ పడుతున్నాడే
X
ఈ శనివారం సాయంత్రం 8 గంటల 45 నిమిషాలకు.. ''బాబు బంగారం'' సినిమా నుండి మొదటి సాంగ్‌ రిలీజవుతోందహో... అంటూ ఇప్పుడు దర్శకుడు మారుతి అండ్‌ టీమ్‌ బాగానే ప్రచారం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కాని.. ఫీల్ గుడ్‌ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నాం అంటూ కాస్త స్ర్టెస్‌ చేసి మరీ చెప్పడం చూస్తుంటే.. ఎందుకో మనోడు టెన్షన్‌ పడుతున్నాడనే అనిపిస్తోంది.

నిజానికి ఇప్పటివరకు అందరూ చిన్న స్టార్లతోనే చేశాడు మారుతి. మొదటి మూడు సినిమాలూ పక్కనెట్టేస్తే.. మొన్న నానితో చేసిందే పెద్ద సినిమా. అయితే ఇప్పుడు వెంకటేష్‌ తో చేస్తున్నాడు కాబట్టి.. ఆయన స్టార్డమ్ తాలూకు బ్యాగేజీ కాస్త గాటిగానే ఉంటుంది. అందుకే ఆంచనాలను అందుకుంటానా లేదా అన్నట్లు కాస్త టెన్షన్‌ పడుతున్నట్లున్నాడు మారుతి. కాకపోతే సాంగ్ ఎలా ఉన్నా కూడా మారుతిని ఎవరేంటారులే. మ్యూజిక్‌ డైరక్టర్ జిబ్రాన్‌.. అలాగే సదరు సినిమాటోగ్రాఫర్‌ మరియు కొరియోగ్రాఫర్‌ మీదనే బాధ్యత ఎక్కువ ఉంటుంది.

ఇకపోతే ఈ సినిమాలో మారుతి ఆల్రెడీ వెంకీని చాలా చలాకీగా.. నయనతారను బాగా హాటుగా చూపించేశాడంటూ ఆ స్టిల్స్ చూస్తే చెప్పొచ్చు. మరి బంగారం బాబుకీ ఆయన బంగారానికీ కెమిస్ర్టీ కూడా అద్బుతంగానే తీర్చిదిద్దుంటాడు. సర్లేండి.. శనివారం సాయంత్రం రిలీజయ్యే సాంగును చూసి మరోసారి ఈ విషయంపైన డిస్కస్ చేద్దాం.