Begin typing your search above and press return to search.
తిడతారని తెలిసే ఆ సినిమా తీశాడట
By: Tupaki Desk | 3 Jan 2017 7:30 PM GMTఇప్పుడైతే మారుతి ఇమేజ్ మారిపోయింది కానీ.. కెరీర్ ఆరంభంలో మాత్రం అతణ్ని అందరూ బూతు డైరెక్టర్ అనేవాళ్లు. ఈ రోజుల్లో.. బస్ స్టాప్ సినిమాలు విజయంతో పాటు విమర్శల్నీ తెచ్చిపెట్టాయి మారుతికి. ముఖ్యంగా ‘బస్ స్టాప్’ సినిమాకైతే మారుతి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐతే ఆ సినిమా చూసి తనను తిడతారని తనకు ముందే తెలుసని చెప్పాడు మారుతి. తన కెరీర్ ఆరంభంలో తీసిన తొలి మూడు సినిమాల వెనుక ఆసక్తికర విశేషాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు మారుతి. అతనేమన్నాడంటే..
‘‘ఈ రోజుల్లో కంటే ముందు నేను ‘బస్ట్ స్టాప్’ సినిమాను మొదలుపెట్టాను. సగం షూటింగ్ కూడా అయింది. కానీ డబ్బుల్లేక మధ్యలో ఆపేశాం. అలాంటి టైంలో రామ్ గోపాల్ వర్మ గారి స్ఫూర్తితో 5డి కెమెరాతో ‘ఈ రోజుల్లో’ సినిమాను మొదలుపెట్టాం. స్నేహితులు.. తెలిసినవాళ్ల సాయంతో కేవలం 15 లక్షల్లో ఆ సినిమా పూర్తి చేశాం. కానీ విడుదలకు ముందు చాలా సమస్యలు వచ్చాయి. ఈ బాధలో ఒక రోజు శ్రీనగర్ కాలనీలో రోడ్డు పక్కన కారాపి కన్నీళ్లు పెట్టుకున్నా. కానీ అనుకోని విధంగా ఆ సినిమా మంచి విజయాన్నందుకుంది. ఆ తర్వాత మధ్యలో ఆపేసిన ‘బస్ స్టాప్’ సినిమాను మళ్లీ మొదలుపెట్టాం. ఆ సినిమాలో అడల్ట్ కంటెంట్ చూసి అందరూ నన్ను తిడతారని ముందే ఫిక్సయ్యా. ఐతే ఆ సినిమా విమర్శలతో పాటు డబ్బులు కూడా తెచ్చింది. నా మూడో సినిమా ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాలోని ప్రతి షాట్ నేనే తీశా. కానీ కొన్ని కారణాల వల్ల నా పేరు వేసుకోలేదు. ఆ సినిమాకు పని చేసిన కెమెరామన్ పేరును దర్శకుడిగా వేశాం’’ అని మారుతి వెల్లడించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/