Begin typing your search above and press return to search.
పుష్ప 'మసాలా సాంగ్' ఇప్పుడే కాదట..!
By: Tupaki Desk | 15 May 2021 2:30 AM GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన యంగ్ సెన్సేషన్ రష్మికమందన హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఇప్పటికే విడుదల చేసిన పుష్ప పోస్టర్స్ - టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఊరమాస్ రఫ్ లుక్కులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చాడు. పాన్ ఇండియా లెవల్‌లో పుష్ప 5భాషల్లో విడుదల కాబోతుంది.
అయితే ఆగష్టు 13న పుష్పను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదాపడింది. అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బన్నీ లారీడ్రైవరుగా కనిపించనున్నాడు. అయితే కథ, కథనం గురించి పక్కన పెడితే ఈ సినిమా రెండు భాగాలుగా రెడీ అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ పూర్తి అయిపోగా ఓ సాంగ్ - రెండు సీన్స్ మాత్రమే బాలన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే సెకండ్ పార్ట్ 10% షూటింగ్ కంప్లీట్ అయ్యిందట.
అయితే డైరెక్టర్ సుకుమార్ - దేవిశ్రీప్రసాద్- అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ఆడియో ఆల్బమ్ పై విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఎందుకంటే వీరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య-2 సినిమాల ఆల్బమ్స్ ఏ రేంజిలో హిట్ అయ్యాయో తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప మూవీ వీరి కలయికలో మూడో సినిమా. ఈ సినిమాతో మ్యూజిక్ పరంగా హ్యాట్రిక్ హిట్టు కొడతారని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.
ఈ మూవీలో మాస్ సాంగ్స్ తో పాటు ఓ మాంచి మసాలా సాంగ్ కూడా ఉందని చెప్పాడు దేవి. మరి ప్రతిసారిలాగే సుక్కు ఈసారి కూడా చాలా సర్ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ స్పెషల్ సాంగ్ సెకండ్ పార్టులో ఉండబోతుందని టాక్. అందుకే మేకర్స్ ఆ సాంగ్ విషయంలో పెద్దగా టెన్షన్ పడట్లేదని సమాచారం. కరోనా పోయి సినిమా షూటింగ్స్ మొదలయ్యే టైంలో దాని గురించి ఆలోచించడం మేలని మేకర్స్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మరి మొత్తానికి దేవి మ్యాజిక్ మరోసారి చూడబోతున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి పుష్ప ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దసరా టైంలో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.