Begin typing your search above and press return to search.
హారర్ డ్రామా డోసుకు గుండెల్లో దడే.. యంగ్ డైరెక్టర్స్ రివ్యూ!
By: Tupaki Desk | 17 Nov 2022 4:34 PM GMTమంచి కథ.. సాంకేతిక సహకారం.. హృదయాన్ని కదిలించే సంగీతం.. కథను నడిపించే దర్శకుడి పనితనం ఇవన్నీ మంచి ఔట్ పుట్ ని ఇచ్చి సక్సెస్ కి రాచబాట వేస్తాయి. 24 శాఖల సమన్వయంతో నేటితరం దర్శకులు ఊహించని రీతిలో మ్యాజిక్కులు చేస్తూ దూసుకుపోతున్నారు. 90లలో వచ్చిన రొటీన్ కంటెంట్ తో పోలిస్తే ఇటీవలి కాలంలో ప్రయోగాత్మకత అసాధారణం. నేటితరం దర్శకులు ప్రతి కథను విలక్షణంగా వైవిధ్యంగా ఎంపిక చేసుకుని తెరపై సాహసాలు చేస్తున్నారు. మన దర్శకులు ప్రయోగాలతో జీవించడానికి అలవాటు పడ్డారు. నేటితరంలో డజను పైగా యంగ్ డైరెక్టర్లు.. దర్శకనిర్మాతలు టాలీవుడ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లగలరన్న ఆశావహ ధృక్పథాన్ని పెంచుతున్నారు.
`మళ్ళీ రావా` లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ... ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి థ్రిల్లర్ తరువాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై తన మూడవ చిత్రంగా మసూద అనే హారర్ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో సంగీత- తిరువీర్- కావ్య కళ్యాణ్ రామ్- బాంధవి శ్రీధర్- శుభలేఖ సుధాకర్- సత్య ప్రకాశ్- సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీమియర్ ని చిత్రయూనిట్ తో పాటు... యువ దర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా... మీడియా సమావేశంలో యువదర్శకులు ప్రశంసలు కురిపించారు.
ఈ సంద్భంగా యువ దర్శకులు ఏజెంట్ సాయి శ్రీనివాస దర్శకుడు స్వరూప్ అర్. ఎస్. జే., కేరాఫ్ కంచర పాలెం దర్శకుడు వెంకటేశ్ మహా.. అంటే సుందరానికీ దర్శకుడు వివేక్ ఆత్రేయ... మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు వినోద్ అనంతోజు.... కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ లు `మసూద` మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే... హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు. ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే గొప్ప అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని చెప్పారు. ఈ జానర్ లో ఇంకొన్ని కథలు రావటానికి `మసూద` ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మన చిన్నతనంలో చూసిన అమ్మోరు- దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని మెప్పించాయో `మసూద` కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. ఈ కథను నమ్మి హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు.
దర్శకుడు సాయి కిరణ్ గురించి మాట్లాడుతూ... కథలోనే హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేసారు. అలా క్రియేట్ చేయడం చాలా కష్టం.. ఆ విషయంలో దర్శకుణ్ణి అభినందించాలి. ఈ చిత్రానికి సౌండ్ అండ్ విజువల్ ముఖ్య పాత్ర పోషించాయని ప్రశంసలు కురిపించారు.
చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. మళ్లీరావా- ఏజెంట్ తరువాత మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్ గా తీశాం. టెర్రిఫిక్ హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు కచ్ఛితంగా నచ్చుతుంది అని మా నమ్మకం. సినిమా కోసం టీంలో అందరూ కష్టపడి పని చేశారు అని తెలిపారు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ మాట్లాడుతూ.. ``సరైన హారర్ సినిమాగా మసూద వస్తోంది. ఇలాంటి చిత్రాలను థియేటర్లో చూస్తేనే థ్రిల్ ఫీలింగ్ వస్తుంది. మేం సినిమాను చూస్తూ ఎంత ఎంజాయ్ చేశామో మీరు చూసినపుడు అర్థమవుతంది. అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతంగా పని చేశాయి. ఆడియెన్స్ ఆ ఎక్స్ పీరియెన్స్ ను ఎంజాయ్ చేస్తారు`` అని అన్నారు.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. నిజానికి హారర్ సినిమా అని చెప్పినప్పుడు.. రొటీన్ అని అనుకున్నాను. కానీ సినిమా చూసిన తరువాత షాక్ అయ్యాను. చాలా చోట్ల కచ్చితంగా భయపడతాం. డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమాగా అనిపించదు. సరైన టీం కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. మ్యూజిక్- సౌండ్- కెమెరా అన్నీ చక్కగా కుదిరాయి`` అని అన్నారు.
వెంకటేష్ మహా మాట్లాడుతూ.. ``హారర్ జానర్ తీయాలనే ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడున్న దర్శకులు అంటున్నారు. నేను కూడా అన్నాను. కానీ నేను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. హారర్ ను ఫుల్లుగా ఎక్స్‌పీరియెన్స్ చేశాను. చాలా భయపడ్డాను. సాయి విజన్ కు తగ్గట్టుగా అద్భుతంగా విజువలైజ్ చేశారు. ఇది విజువల్ హారర్ ఫిల్మ్. సౌండింగ్- మ్యూజిక్ పరంగానూ అద్భుతంగా పని చేశారు. హారర్ అంటే కామెడీ- మసాలా ఉండాలని అనుకునే సమయంలో.. ఇలాంటి కథను నిర్మించిన రాహుల్ కు థాంక్స్. సినిమాలపరంగా రాహుల్ నాకు సోల్ మేట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్`` అని అన్నారు.
మిడిల్ క్లాస్ మెలోడిస్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ..``ప్రస్తుతం హారర్ ఫార్మాట్ రొటీన్ అయింది. అందులోనూ కొత్త ఎలిమెంట్ పాయింట్ తీసుకోవడం బాగుంటుంది. దెయ్యాన్ని చూస్తే వచ్చే భయం కాదు. ఆ సీన్ లోంచి.. వాతావరణంలోంచి భయాన్ని క్రియేట్ చెయ్యటం మామూలు విషయం కాదు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల్లోనే భయపెట్టేస్తాడు. ఇదేదో తేడాగా ఉందే అనే భయం కలుగుతుంది. టీం అంతా కలిసి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఫోన్ లో చూస్తే ఈ ఎక్స్‌పీరియెన్స్ రావడం చాలా కష్టం. థియేటర్లోనే ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథను నమ్మి తీసిన రాహుల్ కు థాంక్స్. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. తప్పకుండా చూడండి`` అని అన్నారు.
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ``అమ్మోరు- కాంతారా ప్రపంచంలో మనం ఉన్నప్పుడు.. పాత్రలకు ఏమైనా జరుగుతూ ఉంటే మనం భయపడుతుంటాం. ఈ చిత్రంలోనూ అలాంటి ఫీలింగ్ వస్తుంది. హారర్ సినిమా చేయాలంటే టెక్నికల్ గా ఎంతో నాలెడ్జ్ ఉండాలి. సాయి మొదటి సినిమానే ఇలా చేయడం చాలా గ్రేట్. సంగీత- తిరువీర్- కావ్యా, శుభలేఖ సుధాకర్ ఇలా అందరూ చక్కగా నటించారు. బెలూన్ సౌండ్‌కి కూడా నా గుండె ఝల్లుమంది. రాత్రి ఇంటికి వెళ్లి ఒంటరిగా భోజనం చేయాలన్నా కూడా భయంగా అనిపించింది. హారర్ సినిమాకు ఆర్.ఆర్ ఇవ్వడం మామూలు విషయం కాదు. రీరికార్డింగ్ విజువల్స్ అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్లోనే చూస్తేనే ఈ ఫీలింగ్ వస్తుంది. మసూద ను థియేటర్లోనే చూడండి`` అని కోరారు.
సాయి కిరణ్ మాట్లాడుతూ..మసూద కల్పిత చిత్రమే. ఇందులో మసూద నెగెటివ్ పాత్ర. ఆమె కోణంలోంచి సినిమా నడుస్తుంది. కాబట్టే ఈ చిత్రానికి మసూద అని టైటిల్ పెట్టాం. మీ అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్.. స్టంట్స్: రామ్ కిషన్ - స్టంట్ జాషువా..సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి..ఎడిటింగ్: జెస్విన్ ప్రభు.
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా.. రచన- దర్శకత్వం: సాయికిరణ్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.