Begin typing your search above and press return to search.
ట్రైలర్: ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో ఉత్కంఠభరితంగా సాగిన 'మసూద'
By: Tupaki Desk | 13 Nov 2022 7:57 AM GMTసీనియర్ నటి సంగీత - తిరువీర్ - కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ''మసూద''. టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.
'భవిష్యత్ అన్నది మనం ఈ రోజు ఏం చేస్తున్నామో.. దాని మీద ఆధారపడి ఉంటుంది' అని సంగీత చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. వింతగా ప్రవర్తిస్తున్న తన కూతురిని చూసి ఆందోళనకు గురైన ఒక ఒంటరి తల్లి.. అతి భయస్తుడైన పక్కింటి యువకుడి సహాయంతో కూతుర్ని ఎలా కాపాడుకుందనేది 'మసూద' ప్రధానాంశంగా ట్రైలని బట్టి తెలుస్తోంది.
ఇందులో తన కూతురి (అఖిల రామ్) తో కలిసి ఆర్థిక సమస్యలతో బ్రతుకూడిస్తున్న మహిళగా సంగీత కనిపించింది. తను ప్రేమించిన అమ్మాయి (కావ్య) కి ప్రేమ విషయం చెప్పడానికి.. ఆమెను డేట్ కు పిలవడానికి ఇబ్బంది పడే భయస్తుడైన యువకుడిగా తిరువూర్ కనిపించాడు.
హార్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన "మసూద'' మూవీలో దెయ్యం కాన్సెప్ట్ ను కొంచెం కొత్తగా డీల్ చేసినట్లు తెలుస్తోంది. దెయ్యం చుట్టూ సాగిన సన్నివేశాలు - క్షుద్ర పూజలు వంటివి భయాన్ని కలిగిస్తున్నాయి. ట్రైలర్ లోని కొన్ని షాట్స్ మరియు విజువల్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
హారర్ ఎలిమెంట్స్ కు తగ్గట్టుగా ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఉత్కఠను జోడించింది. ఇందులో హారర్ మాత్రమే కాదు.. సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ కూడా ఉందని హింట్ ఇచ్చారు. తెలుగులో హార్డ్ కోర్ హారర్ సినిమాలు వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును 'మసూద' భర్తీ చేస్తుందని ట్రైలర్ హామీ ఇస్తోంది.
తిరువూరు తన విలక్షణమైన నటనతో ఆకట్టుకోగా.. సంగీత - అఖిల రామ్ - కావ్య తమ తమ పాత్రల్లో మెప్పించారు. శుభలేఖ సుధాకర్ - సత్యప్రకాష్ - సత్యం రాజేష్ - బాంధవి శ్రీధర్ - సూర్యారావు - సురభి ప్రభావతి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
'మసూద' చిత్రాన్ని సాయి కిరణ్ అనే కొత్త దర్శకుడు తెరెక్కించాడు. 'మళ్లీ రావా' 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. రాహుల్ యాదవ్ నక్కా దీనికి నిర్మాత. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూర్చారు.
అగ్ర నిర్మాత దిల్ రాజు తన ఎస్వీసీ బేనర్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "మసూద" చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.