Begin typing your search above and press return to search.
వీడియో టాక్: మాస్ కు మెగా డెఫినిషన్
By: Tupaki Desk | 20 Dec 2018 6:18 AM GMTరేపు విడుదల కానున్న సినిమాల్లో చాలా విభిన్నంగా అనిపిస్తున్నది వరుణ్ తేజ్ అంతరిక్షం. మిగిలిన వాటికి కావలసినంత హైప్ ఉన్నప్పటికీ ఆ జానర్ లో ఇంతకు ముందు సినిమాలు వచ్చాయి కాబట్టి మెగా ప్రిన్స్ సినిమా థీమ్ సంథింగ్ స్పెషల్ అనేలా కనిపిస్తోంది. దానికి కారణం స్పేస్ థ్రిల్లర్ గా ఇంతవరకు ఏ తెలుగు సినిమా రూపొందకపోవడం. అందుకే దర్శకుడు సంకల్ప్ రెడ్డి చేసిన సాహసానికి రేపు ఎలాంటి స్పందన వస్తుందోనని ట్రేడ్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
కాకపోతే మాస్ కు అంత ఈజీగా కొరుకుడుపడని ఈ స్పేస్ మూవీ కాన్సెప్ట్ వాళ్ళకు రీచ్ అవుతుందా అనే అనుమానం టీం కు సైతం వచ్చినట్టు ఉంది. అందుకే తెలివిగా షార్ట్ ఫిలిం తరహలో రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా కమర్షియల్ సినిమాలకు కొలమానంగా నిలిచే మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఇందులో ఉన్నాయా లేదా అని చెక్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇండియన్ మాస్ కౌన్సిల్ నుంచి ఒక ప్రతినిధి వస్తాడు. వరుణ్ తేజ్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఇందులో హీరోయిజం ఎలివేషన్ గ్రావిటీ మాస్ ఎలెమెంట్స్ లాంటివన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాడు.
లాస్ట్ లో ఐటెం సాంగ్ లేదని తెలుసుకుని వెళ్ళబోతూ ఉంటె వరుణ్ ఆగమని చెప్పి దానికి సరైన సమాధానం ఇవ్వడంతో మాస్ హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చనే సర్టిఫికేట్ తీసుకుంటాడు. అదేంటి అనేది వీడియోలో చూడాల్సిందే. మొత్తానికి వెరైటీగా రూపొందిన ఈ వీడియో ప్రోమో కొత్త తరహా ప్రమోషన్ అని చెప్పొచ్చు. అయితే మాస్ కి కావలసినవి లేవంటూనే ఉందంటూ తెలివిగా వ్యవహరించిన అంతరిక్షం దూసుకుపోయేది లేనిది రేపు తేలిపోతుంది.