Begin typing your search above and press return to search.

కొన్నాళ్ళు మాస్ అండ్ యాక్షన్ సినిమాలను మర్చిపోవాల్సిందే..!

By:  Tupaki Desk   |   22 April 2022 8:30 AM GMT
కొన్నాళ్ళు మాస్ అండ్ యాక్షన్ సినిమాలను మర్చిపోవాల్సిందే..!
X
కరోనా పాండమిక్ తర్వాత వరుసగా క్రేజీ సినిమాలన్నీ థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు ఎప్పటిలాగే సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరచడంతో.. మార్కెట్ కూడా తిరిగి పుంజుకుని సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికే గతేడాది వాయిదా పడిన పాన్ ఇండియా చిత్రాలు - స్టార్ హీరోలు నటించిన భారీ సినిమాలు - డబ్బింగ్ మూవీస్ దాదాపుగా రిలీజ్ అయ్యాయి.

అయితే అందులో ఎక్కువ శాతం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలే ఉన్నాయి. డిసెంబర్ లో బాక్సాఫీస్ బరిలో నిలిచిన 'అఖండ' మరియు 'పుష్ప' సినిమాలు యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇదే క్రమంలో 'భీమ్లా నాయక్' 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలతో పాటుగా 'ఈటీ' 'సామాన్యుడు' వంటి డబ్బింగ్ సినిమాలు వచ్చాయి.

ఫ్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'రాధే శ్యామ్' సినిమా వచ్చినా ప్రేక్షకులు తిరస్కరించారు. ఇప్పుడు లేటెస్టుగా 'బీస్ట్' 'కేజీయఫ్ 2' వంటి రెండు డబ్బింగ్ యాక్షన్ సినిమాలు వచ్చాయి. మిగిలిన ఒకటీ అర యాక్షన్ ఎంటర్టైనర్లు ఈ మూడు వారాల గ్యాప్ లో విడుదల కానున్నాయి. చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుండగా.. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా మే 13న థియేటర్లలోకి రాబోతోంది.

హాట్ సమ్మర్ లో వచ్చే చివరి యాక్షన్ మూవీ 'సర్కారు వారి పాట' అని చెప్పాలి. దీని తర్వాత టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ అందమైన ప్రేమకథలు.. ఫ్యామిలీ స్టోరీలు రాబోతున్నాయి. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్లు - యూత్ ని టార్గెట్ చేసే రొమాంటిక్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఇందులో మెజారిటీ చిత్రాలు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను ఆకర్షించే సినిమాలే ఉండటం గమనార్హం.

మే 6న 'అశోకవనంలో అర్జున కల్యాణం' మరియు 'జయమ్మ పంచాయితీ' సినిమాలు విడుదల కానున్నాయి. మే 27న 'ఎఫ్ 3'.. జులై 1వ తేదీన 'పక్కా కమర్షియల్' మరియు 'రంగ రంగ వైభవంగా' వంటి వినోదాత్మక చిత్రాలు - రొమాంటిక్ ఎంటర్టైనర్స్ రాబోతున్నాయి.

అలానే 'కృష్ణ వ్రింద విహారి' - '18 పేజెస్' - 'గుర్తుందా శీతాకాలం' - 'ఒకే ఒక జీవితం' వంటి మరికొన్ని సినిమాలు ఇదే సీజన్ లో సరైన డేట్ ని బ్లాక్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ లిస్ట్ చూస్తుంటే కొంత కాలం పాటు యాక్షన్ ప్రియులను అలరించే మాస్ సినిమాలు థియేటర్లలో చూడబోమని స్పష్టమవుతోంది.