Begin typing your search above and press return to search.
మాస్ ఖిలాడి డీజే టిల్లు గట్టి పోటీ ఖాయం
By: Tupaki Desk | 9 Feb 2022 9:30 AM GMTసంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ లో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఒకటి రెండు మీడియం రేంజ్ సినిమాలు విడుదల అయినా కూడా అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఆ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోయాయి. కొందరికి అవి వచ్చి పోయినట్లుగా కూడా తెలియలేదు. ఈ వారం నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి వాతావరణం మొదలు కాబోతుంది.
ఈ వారంలో రవితేజ నటించిన ఖిలాడి సినిమా విడుదల కాబోతుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా లో డింపుల్ హయతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. డింపుల్ హయతి అందాల ఆరబోతతో ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ఖాయం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇటీవలే విడుదల అయిన ట్రైలర్ సినిమా పై అంచనాలు మరింతగా పెంచేసింది. ఇంట్రెస్టింగ్ మాస్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూసిన ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు.
ఖిలాడి సినిమా కు ముందు రవితేజకు క్రాక్ తో హిట్ పడింది. దాంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా విడుదల కాబోతుంది. ఖిలాడి విడుదల అయిన ఒక్క రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 12వ తారీకున ఈ టిల్లు గాడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
డీజే టిల్లు సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ డీజే టిల్లు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కాచుకు కూర్చున్నారు. రొమాంటిక్ అండ్ మాస్ సన్నివేశాలతో డీజే టిల్లు సినిమా అర్జున్ రెడ్డిని తలపిస్తుంది అంటూ యూత్ ఆడియన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత టిల్లు క్రేజ్ అమాంతం పెరిగింది. సిద్దకు యూత్ లో విపరీతంగా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు సిద్ద యాక్టింగ్ మరియు లుక్ కు ఫిదా అవుతున్నారు. కనుక టిల్లు గాడి సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు.
ఖిలాడి మరియు డీజే టిల్లు సినిమాలు ఒకే రోజు రావడం లేదు కనుక పెద్ద నష్టం తప్పినట్లు అయ్యింది. రెండు ఒక్క రోజు తేడాతో రాబోతున్న కారణంగా మొదటి రోజు వసూళ్ల విషయంలో రెండు సినిమాలకు ఇబ్బంది లేదు. ఇక ఖిలాడి సినిమా మాస్ రాజా మాస్ డైలాగ్స్ తో థియేటర్లలో కుమ్మేయడం ఖాయం అంటూ ఉంటే.. సిద్దు మాస్ డైలాగ్స్ ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ ను ఫిదా చేస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
ఏ తీరుగా చూసుకున్నా కూడా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ పడుతూ ప్రేక్షకులకు రెండు సినిమాలు కూడా మస్త్ ఎంటర్ టైన్మెంట్ ను ఇవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు ఈ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పూర్తిగా పోయినట్లే అని భావించి చిన్నా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ కు రాబోయే రెండు మూడు నెలల పాటు క్యూ కట్టే అవకాశం ఉందంటున్నారు.