Begin typing your search above and press return to search.

పైలా పచ్చీస్ అంటున్న మాస్ మహారాజ్...?

By:  Tupaki Desk   |   1 Jan 2022 3:30 PM GMT
పైలా పచ్చీస్ అంటున్న మాస్ మహారాజ్...?
X
మాస్ మహారాజ్. ఎంత పెద్ద కితాబు అది. టోటల్ మాసిజానికి ఆయన కింగ్ అన్న మాట. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరుగా నిలబడ్డారు రవితేజా. దాని వెనకాల ఆయన కష్టంతో పాటు ఒద్దిక, ముందు చూపూ అన్నీ ఉన్నాయి. ఇక రవితేజా రెండు దశాబ్దాలుగా హీరోగా వెలుగుతున్నారు.

ఆ మధ్య కాలం కొంత బ్యాడ్ పీరియడ్ నడచినా క్రాక్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు రవితేజా. ఇక వరసబెట్టి ఆయన మూవీస్ చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈసారి రవితేజా అన్ని విషయాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్. దానికి తగినట్లుగానే ఆయన ప్లానింగ్ ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం రవితేజా చేతిలో అరడజన్ కి తక్కువ కాకుండా మూవీస్ ఉన్నాయి. ఈ సినిమాలు అన్నీ కూడా సీనియర్ టెక్నీషియన్స్ తో కాకుండా యంగ్ తరంగ్ తోనే ఉండడం విసేషం. ఆ విధనా ఫ్రెష్ థాట్స్ కి ఆయన చాన్స్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇక హీరోయిన్స్ విషయంలో కూడా రవితేజా పైలా పచ్చీస్ అని అంటున్నారు. పాతికేళ్ళు నిండని భామలకే రవితేజా హీరోయిన్స్ గా చాన్స్ ఇచ్చేస్తున్నాడు. వారు ఒకటి రెండు సినిమాల్లో నటించిన వారే కావడం విశేషం. రవితేజా ఖిలాడీ మూవీలో మీనాక్షీ చౌదరిని తీసుకున్నా అలాగే రామరావు ఆన్ డ్యూటీ మూవీలో దివ్యాన్ష కౌసిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు. ఈ ఇద్దరు భామలు కూడా పాతికేళ్ల లోపు వారే.

ఇక రవితేజా రావణాసుర మూవీని చేస్తున్నారు. అందులో హీరోయిన్ గా 24 ఏళ్ల ముద్దు గుమ్మ ఫరియా అబ్ధుల్లాను ఎంపిక చేసుకున్నారు. దీనితో పాటు మరో రెండు సినిమాలు కూడా రెడీ పెట్టి ఉంచారు. వాటిలో కూడా ట్వెంటీ ప్లస్ భామలకే హీరోయిన్ గా చాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తూంటే రవితేజా సీనియర్ హీరోయిన్లను కాకుండా ఫ్రెషర్స్ ని న్యూ లుక్ ని తెచ్చి తన పక్కన హీరోయిన్స్ గా చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది కూడా మూవీ సక్సెస్ మంత్రానికి ఒక మార్గమని అంటున్నారు.

కొత్తందాలను ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా వారితో నటించడం ద్వారా తాజాదనాన్ని కూడా వెండి తెర మీద చూపించవచ్చు అన్నది రవితేజా ఆలోచనగా ఉందని అంటున్నారు. సో రవితేజా ఒక విధంగా కచ్చితమైన వ్యూహంతోనే వెళ్తున్నారు అనుకోవాలి.