Begin typing your search above and press return to search.
మాస్ మహారాజా ఊహ నిజమైందంటూ సెటైర్లు
By: Tupaki Desk | 20 Oct 2021 5:00 AM GMTదర్శకుడు అజయ్ భూపతి భారీ అంచనాలతో చేసిన చిత్రం `మహా సముద్రం`. శర్వానంద్- సిద్ధార్థ్ తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రంపై రిలీజ్ ముందు భారీ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ ఓ రేంజులో వుంటాయని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. అయితే మూవీ టాక్ డివైడ్ గా వుండటం.. సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం.. రివ్యూస్ .. బ్యాడ్ టాక్ స్ప్రెడ్ కావడంతో సినిమా ఫలితం ఫైనల్ గా ఫ్లాప్ అని తేలింది.
ఈ మూవీ ఫలితం దర్శకుడు అజయ్ భూపతి కెరీర్ కి మైనస్ గా మారే అవకాశం కనిపిస్తోంది. `ఆర్.ఎక్స్ 100` మూవీతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి ఆరంగేట్ర మూవీని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించి మంచి ఇంపాక్ట్‌ని కలిగించాడు. కానీ అదే ఇంపాక్ట్ ని `మహా సముద్రం` విషయంలో మాత్రం కలిగించలేకపోయాడు. మల్టీస్టారర్ కథగా రాసుకున్నా ఆశించిన ఔట్ పుట్ ని తేవడంలో విఫలమయ్యాడు. నిజానికి ఈ మూవీ కోసం ముందు నాగచైతన్యని సంప్రదించాడు. చైతూ ఓకే అని చెప్పినా ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
చివరికి రవితేజని సంప్రదిస్తే తను ఓకే అన్నాడు. ఆ తరువాతే స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. అటుపై సిద్ధార్థ్ లైన్ లోకి వచ్చాడు. కానీ మధ్యలో ఏమైందో రవితేజ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని కథనాలొచ్చాయి. అటుపై ట్విట్టర్ వేదికగా అజయ్ భూపతి `చీప్ స్టార్` అంటూ కామెంట్ చేయడంపై అభిమానుల్లో చర్చ సాగింది. ఆ కామెంట్ ఎవరిని ఉద్ధేశించి అంటూ అప్పట్లో అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చివరికి అనిల్ సుంకర దగ్గరకు చేరింది. శర్వా రంగంలోకి దిగారు. సిద్ధార్థ్ -శర్వా ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కింది. ఇటీవలే రిలీజైన మహాసముద్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తమ ఫేవరెట్ బాగానే తప్పుకున్నారని అభిమానులు అజయ్ భూపతి పై పంచ్ లు వేస్తున్నారు. తమ ఫేవరెట్ ముందే ఊహించిందే జరిగిందిగా అంటూ రవితేజ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.