Begin typing your search above and press return to search.

గోవాలో మాస్ మ‌హారాజా `క్రాక్` పుట్టించారుగా

By:  Tupaki Desk   |   6 Dec 2020 12:39 PM GMT
గోవాలో మాస్ మ‌హారాజా `క్రాక్` పుట్టించారుగా
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం క్రాక్. శ్రుతిహాస‌న్ క‌థానాయిక. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ ఫైన‌ల్ షెడ్యూల్ శుక్రవారం నుండి గోవాలో జ‌రుగుతోంది. రవితేజ- శ్రుతి హాసన్ జంట `పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్‌` వ‌ద్ద చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు.

ఇంత‌కుముందు రాజా తన విమాన ప్రయాణం నుండి కొన్ని సెల్ఫీలను పంచుకోగా అవి ఫ్యాన్స్ లో వైర‌ల్ అయ్యాయి. “ఆఫ్ క్రాక్ # మాస్కాన్ తుది షెడ్యూల్ కోసం ఆఫ్ గోవా” అంటూ వ్యాఖ్య‌ను జోడించారు మాస్ రాజా.

COVID-19 సంక్షోభం లాక్ డౌన్ కారణంగా ఏడెనిమిది నెల‌లు షూట్ ఆగిపోయింది. ఎట్ట‌కేల‌కు క్రాక్ షూటింగ్ అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. కొన్ని కీలకమైన భాగాలను చిత్రీకరించడంతో పాటు మేకర్స్ పైనా ఒక ప్రత్యేక చిత్రీకరణను చేశారు. రవితేజ ఒడిశా అందం అప్సర రాణిపై మాస్ సాంగ్ ని ఏస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ తెర‌కెక్కించారు.

ఇందులో వ‌ర‌ల‌క్ష్మి శరత్‌కుమార్- సముతిర‌కని- సుధాకర్ కోమకుల- వంశీ చాగంటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒంగోల్ నేప‌థ్యంలోసాగే క్రిమినల్ డ్రామాలో కాప్ స్టోరి ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఇందులో కాప్ రోల్ లో మాస్ రాజా ప‌వ‌ర్ చూపిస్తారని స‌మాచారం.

రాజా ఎవరినైనా కొట్టే ముందు రెండుసార్లు ఆలోచించడు. తోలు తీస్తాడు. సంఘంలో ఘ‌రానా గూండాలతో హై-ఆక్టేన్ యాక్షన్.. చేజ్ సీక్వెన్సులు.. పంచ్ డైలాగులు ఉర్రూత‌లూగిస్తాయ‌ని స‌మాచారం.
తమన్ ఎస్ సంగీతం సమకూర్చగా.. సాయి మాధవ్ బుర్రా క్రాక్ కోసం డైలాగ్స్ రాశారు.యు రామ్ లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. తాజాగా గోవా షెడ్యూల్ లో పాట చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి మ‌రిన్ని లైవ్ ఫోటోల్ని చిత్ర‌బృందం ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది. హీరో ద‌ర్శ‌కుడు వీళ్ల‌తో పాటే క‌థానాయిక ఇత‌ర టీమ్ సెట్లో సంద‌డి చేస్తున్న తీరు ఈ ఫోటోల్లో క‌నిపిస్తోంది.