Begin typing your search above and press return to search.
మహేష్ ఫ్యాన్స్ కి మాస్ మసాలా ట్రీట్
By: Tupaki Desk | 29 May 2019 7:21 AM GMTమహర్షి హిట్ అని ఎంత చెప్పుకున్నా ఏదో ఒకరకమైన అసంతృప్తి మహేష్ బాబు ఫ్యాన్స్ ని వెంటాడుతూనే ఉంది. తమ హీరో రేంజ్ ఇది కాదని సాలిడ్ గా ఒక పక్కా మాస్ ఎంటర్ టైనర్ పడితే అప్పుడు తెలుస్తుందని ఎదురు చూస్తున్నారు. శ్రీమంతుడుతో మొదలైన సందేశాల పరంపర ప్రిన్స్ అలాగే కొనసాగించడం వాళ్లకు ఈ మధ్య అంతగా నచ్చడం లేదు.మహేష్ బాక్స్ ఆఫీస్ రేంజ్ దీనివల్లే ఒక స్థాయికి మించి వెళ్లడం లేదని వాళ్ళ మాట.
పోకిరి ఒక్కడు దూకుడు లాంటి సినిమాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. వాళ్ళ మాటల్లో నిజం లేకపోలేదు. సరైన మసాలా సబ్జెక్టు ఒకటి పడాలే కానీ బిసి సెంటర్స్ లో సైతం దుమ్ము దులిపే సత్తా మహేష్ కు ఉంది. ఇది విస్మరించి ఇప్పటిదాకా తనను మోడరన్ వివేకానంద లాగా చూపించాలన్న దర్శకుల తాపత్రయం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు దీన్ని సరిగ్గా పసిగట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
మహేష్ విదేశాల నుంచి రాగానే మొదలుకాబోయే ఈ మూవీ షడ్రసోపేత భోజనం తరహాలో అన్ని ఉండేలా పక్కా ప్లానింగ్ తో స్క్రిప్ట్ రాస్తున్నాడట. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని మహేష్ టచ్ చేసి చాలా కాలమైంది. ఒక్కడు తర్వాత మళ్ళి దాని దాని జోలికి వెళ్ళలేదు. అయితే అనిల్ రావిపూడి అంతర్లీనంగా యాక్షన్ ని పొందుపరుస్తూనే కావాల్సినంత కామెడీ ఎంటర్ టైన్మెంట్ ఉండేలా చేస్తున్నాడట. ఇది నిజంగా మహేష్ అభిమానులకు సూపర్ న్యూసే. కంటెంట్ కరెక్ట్ గా కుదిరితే మహర్షి తరహాలో అగ్రెసివ్ ప్రమోషన్ అవసరం లేకుండానే మహేష్ 26 రికార్డుల పని పట్టడం ఖాయం