Begin typing your search above and press return to search.

మాస్ మొగుడు తో శ్రుతిహాస‌న్ అల్ల‌రి ప‌నులు!

By:  Tupaki Desk   |   2 Jan 2023 5:30 AM GMT
మాస్ మొగుడు తో శ్రుతిహాస‌న్ అల్ల‌రి ప‌నులు!
X
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. నటసింహా ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారని చిత్రబృందం చెబుతోంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే పోస్టర్లు టీజర్ లిరిక‌ల్ సింగిల్స్ తో క్యూరియాసిటీని పెంచడంలో మలినేని బృందం సక్సెస్అయింది. రిలీజ్ అయిన మూడు పాట‌లు శ్రోత‌ల్ని అల‌రిస్తున్నాయి. జై బాల‌య్య‌...సుగుణ సుంద‌రి..'సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్ కందిపోయే లా..ప్రేమా పుట్టిందే..పిచ్చి ప్రేమ పుట్టిందే' అంటూ సాగే పాటలు ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ లో దూసుకుపోతున్నాయి.

బాలయ్య అభిమానులు పాటకు స్టెప్పులు అందుకోవాల్సిందే అన్న రీత‌ను వైర‌ల్ అవుతున్నాయి. ఎస్.ఎస్. థమన్ అందించిన ట్యూన్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా నాల్గ‌వ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసారు. 'మాస్ మొగుడు' అంటూ సాగే లిరికల్ వీడియో ఈ నెల 3న విడుదల కానుంది. ఇందులో బాలకృష్ణ మీసాలు తిప్పుతూ కనిపిస్తుండగా.. శృతి హాసన్ అతని భుజంపై చేయి వేసింది స్టైల్ గా నుంచుంది.

ఇద్ద‌రి ఆహార్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి. 'మాస్ మొగుడు' పాట కూడా మాస్ ఆడియ‌న్స్ లో సంచ‌ల‌న‌మ‌య్యేలా నే క‌నిపిస్తుంది. ఫాస్ట్ బీట్‌లతో సాగే మాస్ నంబర్‌లా ఫోక‌స్ అవుతుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ డాన్స‌ర్లు సెట‌ప్ అంతా చూస్తుంటే పాట కోసం భారీగానే వెచ్చించిన‌ట్లు క‌నిపిస్తుంది. పాట మొత్తాన్ని ఓ సెట్ లో షూట్ చేసిన‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి. లిరిక‌ల్ లీకైతే పాట‌కి సంబంధించి మ‌రింత అప్డేట్ తెలుస్తుంది.

ఇంకా సినిమా నుంచి మ‌రిన్ని లిరిక‌ల్స్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్ప‌టికే అభిమానుల నుంచి నిర్మాణ సంస్థ‌పై ఒత్తిడి పెరిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారంలో వీక్ అంటూ సోష‌ల మీడియాలో కామెంట్లు ప‌డుతున్నాయి. దీంతో స‌ద‌రు సంస్థ ఇప్పుడిప్పుడే స్పీడ‌ప్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.