Begin typing your search above and press return to search.

మెగా మాస్ వర్సెస్ మెగా క్లాస్

By:  Tupaki Desk   |   6 Feb 2018 10:54 AM GMT
మెగా మాస్ వర్సెస్ మెగా క్లాస్
X

క్లాస్ వర్సెస్ మాస్.. ఇది ఎప్పుడూ కనిపించే పోటీనే. ఒకే సమయంలో ఈ రెండు జోనర్లకు చెందిన సినిమాలను రేస్ లో నిలపడం టాలీవుడ్ జనాలకు అలవాటే. వేర్వేరు జోనర్ సినిమాలు కాబట్టి.. దేని ఆడియన్స్ దానికి ఉంటారని మేకర్స్ భావిస్తారు. రీసెంట్ గా ఎంసీఏ.. హలో అంటూ రెండు సినిమాల మధ్య నెలకొన్న పోటీ కూడా ఇలాంటిదే.

సహజంగా మాస్ వర్సెస్ క్లాస్ సినిమాల్లో.. ఎక్కువగా మాస్ సినిమాల ఆధిపత్యం కనిపిస్తుంది. ఎంసీఏకు ఆదరణ దక్కడం గుర్తు చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ నాయక్.. మహేష్ బాబు- వెంకటేష్ లు నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్న సీతమ్మ కంటే.. నాయక్ కే ఎక్కువ వసూళ్లు దక్కడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వారంలో తొలిప్రేమ వర్సెస్ ఇంటెలిజెంట్ అంటూ ఇలాంటి పోటీనే కనిపించనుంది.

తొలిప్రేమ పక్కా క్లాస్ మూవీ కాగా.. ఇంటెలిజెంట్ ఊరమాస్ చిత్రం అని ఇప్పటికే చెప్పేశారు. ఫిదాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఊపులో వరుణ్ తేజ్ ఉంటే.. వరుసగా నాలుగు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు సాయిధరం తేజ్. కానీ తొలిప్రేమను వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తే.. ఇంటెలిజెంట్ కు మాస్ దర్శకుడు వివి వినాయక్ అసలు సిసలైన స్ట్రెంగ్త్. ఇపుడు మాస్ వర్సెస్ క్లాస్ పోటీతో పాటు.. మెగా క్లాస్ వర్సెస్ మెగా మాస్ అన్నట్లుగా పోటీ రసవత్తరంగా తయారైంది.

ఇద్దరిలో ఎవరు హిట్ కొట్టినా మెగా ఫ్యాన్స్ కు పండగే కానీ.. క్లాసు మాసుల్లో స్ట్రెంగ్త్ ఎవరిదనే సంగతే ఆసక్తికరం. ప్రస్తుతం ఇండస్ట్రీలోను జనాల్లోను ఉన్న బజ్ ప్రకారం చూస్తే.. తొలిప్రేమకు ఎడ్జ్ కనిపిస్తున్న మాట వాస్తవమే. కానీ మాస్ సినిమాలను ఏ సమయంలోనూ తక్కువ అంచనా వేయకూడదు. కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా ఇవి సృష్టించే అద్భుతాలు మామూలుగా ఉండవు. ఇక క్లాస్ పిక్చర్స్ అయితే ట్రెండ్ సెట్టర్స్ గాను.. క్లాసిక్స్ గాను పేరు తెచ్చేసుకుంటాయి. ఈ మెగా యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలి.