Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: రేస్ కు బాస్ లు దూరం
By: Tupaki Desk | 4 Dec 2018 1:30 AM GMTమాస్ లో బాస్ లేమయ్యారు? ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం! అంటూ ఊరిస్తారు తప్ప రానే రారు. వచ్చి బాక్సాఫీస్ ని ఊపేయరేంటో! ఇరుగుపొరుగు వాళ్లొస్తున్నారు. టాలీవుడ్ సొమ్ముల్ని ఆరాంగా ఎత్తుకెళ్తున్నారు. సర్కార్ వచ్చి వెళ్లాడు. 2.ఓ వసూళ్లన్నీ ఇక్కడి నుంచే వెళుతున్నాయి. కానీ మనవాళ్లు రారేం.. ఎందుకీ తాత్సారం? ఓ లుక్కేద్దామా?
టాలీవుడ్ గత కొంతకాలంగా మూగవోయింది ఎందుకో. సరైన రిలీజ్ లు లేక.. సరైనోళ్లు రాక! అపుడెపుడో వచ్చిన `అరవింద సమేత వీరరాఘవ` మినహా సరైన సినిమానే లేదు. మాస్‌ని ఓ ఊపుఊపి బాక్సాఫీస్‌ని గజగజ ఒణికించే ఒక్కటంటే ఒక్కటీ రాలేదు. ఇది ఫ్యాన్స్ కే కాదు టాలీవుడ్ కి తీవ్ర నిరాశే. ఈ నిరాశ నుంచి బయటపడాలంటే ఇంకా చాలా కాలమే వేచి చూడాల్సిన సన్నివేశం ఉంది. ఈ డిసెంబర్‌లో `అంతరిక్షం` లాంటి ప్రయోగం - క్లాస్ సినిమా మినహా మాస్ ని ఊపేసే - బాక్సాఫీస్ ని ఒణికించే సినిమా ఏదీ కనిపించడం లేదు. అటుపై జనవరిలో ఉందిలే పండగ అన్న ఆలోచన తప్ప మాస్ లో అంత హుషారేం లేదు. థియేటర్ల వైపు కదిలి వెళ్లాలంటే వచ్చే సినిమాలో అంత ఊపు తెచ్చే ఎలిమెంట్ ఏదైనా ఉండి తీరాలి. ఆ ఊపు రామ్ చరణ్ నటించిన `వినయ విధేయ రామా` వచ్చే వరకూ రాదేమో?! అంటే కొత్త సంవత్సరం ఆరంభంలోనే మాస్ కి కొత్త ఉత్సాహం వస్తుందన్నమాట. జనవరి 9న ఎన్టీఆర్ బయోపిక్-1 `కథానాయకుడు`పై భారీ అంచనాలున్నా - మెగాభిమానుల్ని కదిలించే మాస్ సినిమా `వినయ విధేయ రామా` మరో రెండ్రోజుల గ్యాప్ తో వస్తోందని చెబుతున్నారు. జనవరి 11 తేదీని చెర్రీ కోసం లాక్ చేశారని తెలుస్తోంది. బోయపాటి మాసిజానికి చరణ్ గ్రేసు యాడైతే బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే. రంగస్థలం తర్వాత కొత్త ఊపుతో ఉన్న చిరుతలా దూకుతున్నాడు చరణ్.
అటుపై ఎవరున్నారు? అంటే దగ్గర్లో ఎవరూ కనిపించడం లేదు. చరణ్ మినహా ఇతర స్టార్ హీరోలంతా ఆలస్యంగానే వస్తున్నారు. పవర్ స్టార్ పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో అతడి సినిమా లేనేలేదు. పవన్ సందడిని టాలీవుడ్ మిస్సయ్యింది. ఇక తమ్ముడు ఇచ్చిన గ్యాప్‌ని అన్నయ్య ఏమైనా ఫిల్ చేస్తాడా? అంటే అదీ కుదరలేదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ హిస్టారికల్ సినిమా `సైరా -నరసింహారెడ్డి` ఇప్పట్లో రిలీజ్ కి లేదు. సమ్మర్ తర్వాతనే అన్న మాటా వినిపిస్తోంది. కనీసం మహేష్ నటిస్తున్న `మహర్షి` అయినా దగ్గర్లో లేదు. `భరత్ అనే నేను` తర్వాత నిరాఘంటంగా షూటింగులో పాల్గొంటున్నారు మహేష్. ఏప్రిల్ 5న మహర్షి వస్తాడట. అంటే ఇంకో ఐదునెలలు వేచి చూడాలి.
`అరవింద సమేత` తర్వాత ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీ. ఈ సినిమా 2020లో కానీ రిలీజ్ కాదు. ఎన్టీఆర్ - చరణ్- రాజమౌళి భారీ మాస్ ఎంటర్ టైనర్ కి ఏడాది పైగానే సమయం ఉంది. ఈలోగా డార్లింగ్ ప్రభాస్ సందడి ఉంటుందా? అంటే `సాహో` సానా దూరంలోనే ఉంది. సమ్మర్ తర్వాతనే ఏక్ నిరంజన్ సందడి అని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటివారంలోపు `సాహో` సినిమా రాదు. రిలీజ్ తేదీపైనా మేకర్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉందింకా. ఇక అల్లు అర్జున్ సన్నివేశం మరోలా ఉంది. త్రివిక్రమ్ - విక్రమ్.కె కుమార్ అంటూ కథలపైనే ఇంకా గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. అందువల్ల అతడి సినిమా ఆలస్యంగా ప్రారంభం కాకపోవడంతో వచ్చే ఏడాది చివరి వరకూ అతడి సినిమా వస్తుందని ఊహించలేం.
ఏంటో ఈ సంధికాలం. ఉన్నట్టుండి ఎందుకిలా అయ్యిందో. మాస్ లో బాస్ లంతా రేసింగ్ కి దూరం దూరం అంటున్నారు. 2.0 - సర్కార్ లాంటి భారీ చిత్రాలన్నీ తమిళోల్లవే.. వీటితోనే ఇప్పటికి సంతృప్తి పడాల్సొచ్చింది... సంక్రాంతి రేసులోనే మళ్లీ డబ్బింగ్ సినిమాల జాతర ఉంది. మాస్ హీరోలు రజనీకాంత్ నటించిన `పెట్టా` - అజిత్ `విశ్వాసం` పండగ బరిలో ఉన్నాయి. వీటితోనే ఈసారి సంక్రాంతి గడుస్తుంది. మనోళ్లు ఏంటో ఎందుకో ఇలా!!