Begin typing your search above and press return to search.
మాస్ రోల్ .. మాస్ నెంబర్ హైలైట్ అంటున్న కుర్రహీరో!
By: Tupaki Desk | 14 Sep 2022 11:30 AM GMTకిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీ కు బాగా కావాల్సినవాడిని' సినిమా రూపొందింది. కోడి రామకృష్ణ కూతురు దివ్య ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ఆమె నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ శంకర్ దర్శకత్వం వహించాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను టూ షేడ్స్ లో కనిపిస్తాను. మాస్ షేడ్ లో కనిపించే పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - మాటలు నేనే రాశాను. దర్శకుడితో ఉన్న చనువు కారణంగా రాశానే తప్ప, నేను హీరోను కదా అని జోక్యం చేసుకోవడం కాదు. ప్రధానంగా ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ కి సంబంధించిన బాండింగ్ చుట్టూ తిరుగుతుంది.
నేను హీరోనే అయినప్పటికీ కథ వారి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. తండ్రి పాత్రకి ఎస్వీ కృష్ణారెడ్డి గారు ఒక నిండుదనాన్ని తీసుకుని వచ్చారు. హీరోయిన్స్ ఇద్దరిలో ఒకరు ఫస్టు పార్టులో మరొకరు సెకండ్ పార్టులో కనిపిస్తారు. ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. మాస్ నంబర్ తో పాటు మిగతా పాటలన్నీ కూడా బాగా కుదిరాయి. ఈ సారి డాన్సులకు కూడా మంచి మార్కులు పడతాయి.
మొదటి నుంచి కూడా నాకు మణిశర్మగారి సంగీతం అంటే ఇష్టం. ఈ సినిమా కోసం ఆయన చేసిన ట్యూన్లు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలోని ఒక పాటలో చిరంజీవి గారి .. బాలకృష్ణగారి పాటలను మిక్స్ చేయడం జరిగింది. నేను కావాలని అడిగితేనే మణిశర్మ గారు అలా మిక్స్ చేశారు. ఆడియన్స్ ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నిస్సందేహంగా చెప్పచ్చు. బాబా భాస్కర్ కామెడీ హైలైట్ అవుతుంది. మా కాంబినేషన్లోని సీన్స్ చూసి అంతా కూడా హాయిగా నవ్వుకుంటారు.
కోడి రామకృష్ణగారి సినిమాలను నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అలాంటిది ఆయన కూతురు నిర్మాణంలో ఈ సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా వైజాగ్ .. రాజమండ్రి .. అన్నవరం ..
హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగును చేశాము. హీరోయిన్ ఫ్యామిలీ ఎమోషన్స్ లోకి హీరో ఎంటరై చెప్పే డైలాగ్ లా ఈ టైటిల్ ఉంటుంది. జనంలోకి వెంటనే వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ ను సెట్ చేయడం జరిగింది. ఈ సినిమా తప్పకుండా నాకు హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.