Begin typing your search above and press return to search.

సీటిమార్ ఐటమ్ సాంగ్ లో మాస్ రాజా అప్సర!!

By:  Tupaki Desk   |   19 Feb 2021 3:30 AM GMT
సీటిమార్ ఐటమ్ సాంగ్ లో మాస్ రాజా అప్సర!!
X
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో గోపీచంద్ ఇటీవల సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమా కంప్లీట్ చేసాడు. ఏప్రిల్ 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఇదివరకే సంపత్ గోపిల కాంబినేషన్ లో 'గౌతమ్ నంద' సినిమా వచ్చింది. ఆ సినిమాకు టాక్ బాగానే వచ్చినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఆ మూవీ తర్వాత డైరెక్టర్ సంపత్ నుండి ఏ సినిమా రాలేదు. భారీ గ్యాప్ తీసుకొని మంచి స్పోర్ట్స్ స్క్రిప్ట్ తో గోపీతో సీటిమార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సంపత్. ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అదీగాక ఈ సినిమాలో గోపీచంద్, తమన్నాలు కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. అయితే సంపత్ నంది సినిమాలలో క్లాస్ అంశాలతో పాటు మాస్ మసాలా అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

సీటిమార్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఉన్నప్పటికీ సంపత్ మార్క్ పాటలు, మాస్ అంశాలు ఉంటాయట. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కేవలం ఓ ఐటమ్ సాంగ్ మిగిలి ఉందని సమాచారం. సంపత్ మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న దర్శకుడు.. ప్రతీ సినిమాలో లాగే సీటిమార్ లో కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసాడట. మంచి మసాలా పాటగా రూపొందించనున్న ఐటమ్ పాటలో బూమ్ బద్దల్ బ్యూటీ 'అప్సరరాణి' నర్తించబోతుందట. ఇదివరకే ఉల్లాల ఉల్లాల, క్రాక్ సాంగ్స్ లో హాట్ అందాలను ఆరబోసి కుర్రాళ్లలో హీట్ పెంచింది అప్సర. టాలీవుడ్ లో స్టార్ ఐటమ్ గర్ల్ గా పేరొందిన అప్సరకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయట. త్వరలో ఐటమ్ సాంగ్ షూట్ చేసే సన్నాహాలు చేస్తున్నారు సంపత్. తాజాగా ట్విట్టర్ వేదికగా పఠాకా రాణి అంటూ అప్సరరాణి పేరు కన్ఫర్మ్ చేసాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.