Begin typing your search above and press return to search.
మాస్ రాజా ఫ్యామిలీ ట్రిప్.. సెల్ఫీ వైరల్
By: Tupaki Desk | 21 May 2023 3:06 PM ISTమాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం తెలుగులో అందరికంటే స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు సినిమాలని రిలీజ్ చేసేస్తున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా రావణాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రవితేజ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే సమ్మర్ ముగుస్తూ ఉండటంతో రవితేజ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్ ప్లాన్ చేశారు. ఓ వారం రోజుల పాటు ఈ వెకేషన్ లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి రెడీ అయ్యారు.
ఇక వెకేషన్ పూర్తయిన తర్వాత మరల వచ్చే వారం నుంచి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారంట. ఈ ఫ్యామిలీ వెకేషన్ కోసం భార్య, కొడుకు, కూతురుతో కలిసి రవితేజ యూరప్ ఫ్లైట్ ఎక్కేశారు. సమ్మర్ వస్తే మన సెలబ్రిటీలు అందరూ కూడా కాస్తా కూల్ వాతావరణం ఉండే దేశాలకి వెకేషన్ కి వెళ్లి కొద్ది రోజులు ఎంజాయ్ చేసి వస్తారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లి తిరిగొచ్చారు. ఇదిలా ఉంటే టైగర్ నాగేశ్వరరావు సినిమాని గ్రాండ్ స్కేల్ లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ మూవీకి ఒక్కో భాషలో ఒక్కో హీరోతో వాయిస్ ఓవర్ చెప్పించబోతున్నారు. బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం టైగర్ నాగేశ్వరరావు సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పడానికి ముందుకి రావడం విశేషం.
మరో వైపు టైగర్ నాగేశ్వరరావు పూర్తయిన తర్వాత రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సీక్వెల్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాగే డైరెక్టర్ బాబీ కూడా లైన్ లో ఉన్నారు. వీరిలో ఒకరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట.