Begin typing your search above and press return to search.

శ్రీలీల కోసం యంగ్ హీరోల‌కంటే స్పీడ్ గా మాస్ రాజా!

By:  Tupaki Desk   |   14 Feb 2022 7:44 AM GMT
శ్రీలీల కోసం యంగ్ హీరోల‌కంటే స్పీడ్ గా  మాస్ రాజా!
X
`పెళ్లి సంద‌D` ఫేం శ్రీలీల‌కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తొలి సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో వీణ‌లు మ్రోగించింది బ్యూటీ. అందం..అభిన‌యంతో యువ‌త‌ని ఆక‌ట్టుకుంది. ఇప్పుడీ బ్యూటీతో న‌టించ‌డానికి యంగ్ హీరోలంతా ఉత్సాహం చూపిస్తున్నారు. త‌న‌లో ఏదో ఛామ్ హీరోల్ని అట్రాక్ట్ చేస్తోంది. అయితే అంత‌కంటే ముందే మాస్ మ‌హారాజా ర‌వితేజ శ్రీలీల‌ని లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో `ధ‌మాకా` తెర‌కెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల న‌టిస్తోంది.

తొలి సినిమా జాయాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కేవ‌లం శ్రీలీల ట్యాలెంట్ చూసే ఎంపిక చేసారు. బ్యూటీకి యూత్ లో ఉన్న క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోబోతుంది టీమ్. ర‌వితేజ‌కి హీరోయిన్ల స‌మస్య చాలాకాలంగా ఫేస్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సంగ‌తి ముందే గ్ర‌హించిన రాజా అండ్ టీమ్ పెళ్లి సంద‌డి సెట్స్ లో ఉండ‌గానే మంత‌నాలు జ‌రిపి లాక్ చేసినట్లు తెలుస్తోంది. లేదంటే కుర్ర హీరోల‌తో బ్యూటీ రెండు మూడు సినిమాల‌కు క‌మిట్ అయ్యిదని తెలుస్తోంది. తాజాగా నేడు ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా `ధ‌మాకా` లో శ్రీలీల పోషిస్తోన్న పాత్ర‌ని రివీల్ చేసారు. సినిమాలో శ్రీలీల పావ‌ని అనే యువ‌తి పాత్ర‌లో మెప్పించ‌నుంది.

ర‌వితేజ‌..శ్రీలీల జంట‌గా ఉన్న పోస్ట‌ర్ లో రాజా ఏదో మాయ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ర‌వితేజ సీరియ‌స్ గా ఏదో విష‌యం చెబుతుంటే ప్ర‌ణ‌వి అంతే సీరియ‌స్ గా తింటోన్న ప‌ల్లీలు సైతం స్టాప్ చేసి ఏకాగ్ర‌త‌తో వింటోంది. ఈ లుక్ లో శ్రీలీల టీష‌ర్ట్..డెనిమ్ జీన్స్ ప్యాంట్ ధ‌రించింది. ర‌వితేజ మోడిష్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఇక షూటింగ్ అప్ డేట్ విష‌యానికి వ‌స్తే మొద‌టి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. రెండ‌వ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. డ‌బుల్ ఇంపాక్ట్ అనేది సినిమా ట్యాగ్ లైన్. దీన్ని బ‌ట్టే సినిమా రాజా మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా...త్రినాధ‌రావు మార్క్ చిత్రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ- అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్స్ట్ పై టి.జి విశ్వ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ స్టోరీ..మాట‌లు అందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

`ధ‌మాకా` స‌క్సెస్ శ్రీలీల కెరీర్ కి ఎంతో కీల‌కం. తొలి సినిమా `పెళ్లి సంద‌డి` అంచ‌నాల్ని అందుకోలేదు. కానీ శ్రీలీల‌కి మంచి పేరొచ్చింది. ఆవెంట‌నే ర‌వితేజ‌తో అవ‌కాశం రావ‌డంతో లాక్ అయింది. కానీ మాస్ రాజా వ‌రుస వైఫ‌ల్యాల్లో ఉన్నారు. ఇటీవ‌ల విడుద‌లైన `ఖిలాడి` భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ఎలా చతికిల ప‌డిందో తెలిసిందే. రొటీన్ కంటెంట్ కార‌ణంగా అందులో న‌టించిన హీరోయిన్లు? విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

హీరోయిన్ల‌ను కేవ‌లం గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ కే ప‌రిమితం చేసారు. లిప్ లాక్ లు..రొమాంటిక్ స‌న్నివేశాల‌కే హీరోయిన్లు పెట్టారా? అని విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. `ధ‌మాకా` విష‌యంలో అలాంటి త‌ప్పిదాలు జ‌రిగితే గ‌నుక శ్రీలీల క్రేజ్ కి డ్యామేజ్ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.