Begin typing your search above and press return to search.

మాస్ రాజా ను లిప్ లాక్‌ ల ఖిలాడి అంటున్నారు!

By:  Tupaki Desk   |   6 Feb 2022 12:30 PM GMT
మాస్ రాజా ను లిప్ లాక్‌ ల ఖిలాడి అంటున్నారు!
X
రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 11న విడుదల కాబోతున్న ఈ సినిమాలో డింపుల్‌ హయతీ మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌ గా నటించారు. వీరిద్దరితో రవితేజ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇప్పటికే డింపుల్‌ హాయతీ ఫొటోలు మరియు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమా తో ఆమె రేంజ్‌ టాలీవుడ్‌ లో పెరగడం ఖాయం అంటూ అంతా నమ్మకంతో ఉన్నారు. ఎక్స్ పోజింగ్‌ విషయంలో ఇద్దరు హీరోయిన్స్ కూడా పోటీ పడ్డట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో రవితేజ ఇద్దరు ముద్దుగుమ్మలతో లిప్ లాక్ చేసిన విషయం వైరల్‌ అవుతోంది.

ఇప్పటి వరకు రవితేజ సినిమాలు అంటే పెద్దగా రొమాంటిక్‌ సన్నివేశాలు ఉంటాయనే ప్రేక్షకులు ఆశించరు. ఆయన మాస్ డైలాగ్స్ మరియు యాక్షన్‌ సన్నివేశాలను మాత్రమే ప్రేక్షకులు కోరుకుంటారు. కాని ఈ సినిమా ప్రేక్షకులు కోరుకున్న దానికంటే ఎక్కువ ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించబోతున్నట్లుగా చెబుతున్నారు.

దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాలో కథానుసారంగా రొమాంటిక్ సన్నివేశాలను కూడా జొప్పించాడనే వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదల తర్వాత రవితేజ ను ఆ సన్నివేశాల్లో చూసి అంతా ఆశ్చర్యపోతారని కూడా యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.

యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందిన ఖిలాడి సినిమాలో రవితేజ పాత్ర రెండు వేరియేషన్స్ ను కలిగి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ సినిమాలో కీలక పాత్రను అనసూయ చేయడం ద్వారా సినిమాపై అంచనాలు ఆసక్తి మరింతగా పెరిగింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త మరియు పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రల రేంజ్ లోనే ఖిలాడి లో ఆమె పాత్ర ఉంటుందని తాజాగా ఆమె లుక్ ను విడుదల చేసిన తర్వాత ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ స్పెషల్‌ అప్పియరెన్స్ మరియు హీరోయిన్స్ తో రవితేజ లిప్‌ లాక్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌ అవుతాయని అంటున్నారు. మొత్తానికి మాస్ రాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో రాబోతుండటంతో అభిమానులు ఫుల్‌ ఖుషి అవుతున్నారు.