Begin typing your search above and press return to search.

వీరయ్య కోసం విక్రమ్‌ సాగర్ గా మాస్ రాజా లుక్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   12 Dec 2022 6:31 AM GMT
వీరయ్య కోసం విక్రమ్‌ సాగర్ గా మాస్ రాజా లుక్ అదుర్స్‌
X
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాలో రవితేజ నటించాడు. అది కూడా ఒక ఫుల్ లెంగ్త్ రోల్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయిన విషయం తెల్సిందే.

వాల్తేరు వీరయ్య లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. అది నిజమే అన్నట్లుగా తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఫస్ట్‌ లుక్‌ ను రివీల్ చేసి అధికారికంగా ప్రకటించారు. వాల్తేరు వీరయ్య లో విక్రమ్‌ సాగర్ ఏసీపీ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు.

ఈ పోస్టర్‌ లో రవితేజను చూసి ఆయన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రవితేజ తో గతంలో పవర్ వంటి పవర్ ఫుల్‌ సక్సెస్ ను ఇచ్చిన బాబీ మరోసారి రవితేజను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ చర్చ జరుగుతోంది.

చేతిలో గొడ్డలి.. చేతిలో చిన్న మేక పిల్ల చాలా యూనిక్ గా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ లో రవితేజ లుక్ ఉండటంతో కాన్సెప్ట్‌ విభిన్నంగా ఉందనిపిస్తుంది. సినిమాలో ఆయన నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర అయ్యి ఉంటుందా లేదంటే.. చిరంజీవి తో సమానమైన హీరో రోల్‌ అయ్యి ఉంటుందా ఇప్పటి వరకు ఏ ఒక్కరు ఊహించలేక పోతున్నారు.

మొత్తానికి వాల్తేరు వీరయ్య సినిమాలోని రవితేజ లుక్ అదిరి పోయింది అంటూ అంతా అనుకునే విధంగా లుక్ ఉందని చెప్పాలి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను సరిగ్గా నెల రోజుల్లో అంటే వచ్చే నెల 13వ తారీకున సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రవితేజ పై హైదరాబాద్ లో మరియు చిరంజీవిపై యూరప్‌ లో వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు వారాల్లో సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.