Begin typing your search above and press return to search.

వీడియో : మాస్ రాజా మాస్‌ దండకడియాల్‌...

By:  Tupaki Desk   |   8 Dec 2022 7:47 AM GMT
వీడియో : మాస్ రాజా మాస్‌ దండకడియాల్‌...
X
మాస్ మహారాజా హీరోగా శ్రీలీలా హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రవితేజ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు నమ్మకం పెట్టుకుని ఉన్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమా నుండి పాటలు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే వచ్చిన పాటలు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా తాజాగా దండకడియాల్‌ అంటూ మరో మాస్ బీట్‌ సాంగ్‌ ను యూనిట్‌ సభ్యులు విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.

సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాట మరోసారి మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయం అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేశారు. అన్నట్లుగానే ఈ పాట మాస్ కు కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంది. ఈ పాటను సిసిరోలియో తో కలిసి మంగ్లీ కూడా పాడింది.

ఈ మధ్య కాలంలో మంగ్లీ పాడిన పాటల్లో మెజార్టీ పాటలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. అందుకే ఈ పాటను కొంత భాగం ఆమెతో పాడించారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తో రవితేజ మాస్ హిట్ ను దక్కించుకోవడం ఖాయం అని.. ఈ పాటతో పాటు చిత్రంలోని అన్ని మాస్ బీట్‌ సాంగ్స్ కు రవితేజ డాన్స్ అదిరి పోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.