Begin typing your search above and press return to search.
`టైగర్ నాగేశ్వరరావు` బయోపిక్ కోసం మాస్ రాజా రెడీ!
By: Tupaki Desk | 8 Aug 2021 12:50 PM GMTమాస్ మహారాజా రవితేజ `క్రాక్` హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. `రాజా ది గ్రేట్` తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చూసిన రవితేజ మళ్లీ `క్రాక్` రూపంలో ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ ` ఖిలాడీ` లో నటిస్తున్నారు. అలాగే `రామారావు ఆన్ డ్యూటీ `అనే మరో చిత్రం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో రవితేజ నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు. రెండు చిత్రాలపై మంచి బజ్ ఉంది. రామారావు ఆన్ డ్యూటీలో రాజా ఏకంగా పెట్టుబడే పెట్టడంతో స్క్రిప్ట్ పైనా దృష్టి సారించారు. ఔట్ పుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఖిలాడీ నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. రామారావు షూటింగ్ దశలో ఉన్నాడు. వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ రెండిటితో బిజీగా ఉండగానే మాస్ రాజా మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఏకంగా పాన్ ఇండియా రేంజులో సినిమా చేయాలని కంకణం కట్టుకున్నాడని తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గురించి గత రెండేళ్లుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ కథ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ .. రానా వంటి వారిని సంప్రదించారు. చివరికి రవితేజ వద్దకు వచ్చింది. వంశీకృష్ణ స్క్రిప్ట్ పై కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. చివరిగా రవితేజతో లాక్ అయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నట్లు తెలుస్తోంది.
స్టువర్ట్ పురం దొంగ అయిన క్రిమినల్ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి కమర్శియల్ అంశాలు జోడించి మాస్ రాజా ఇమేజ్ కు ఎంత మాత్రం తగ్గకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఈ యాక్షన్ డ్రామాను అభిషేక్ అగర్వాల్ అత్యంత భారీ బడ్జెట్ తో బహుభాషల్లో నిర్మిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.