Begin typing your search above and press return to search.
దళపతికి బొప్పి కట్టించిన మాంసం కత్తి
By: Tupaki Desk | 24 Sep 2019 11:56 AM GMTఇటీవల మనోభావాలు దెబ్బ తినడం కామన్ గా మారింది. అయిన దానికి కానిదానికి మనోభావాలు దెబ్బ తినేస్తున్నాయి. ఒకప్పుడు హిందూ-ముస్లిం గొడవలపై సినిమా తీసిన మణిరత్నం వల్ల ముస్లిముల మనోభావాలు దెబ్బ తిని తీవ్ర విధ్వంశమే జరిగింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఇంటిపైనే దాడికి దిగి అద్దాలు పగలగొట్టారు. అయితే ఆ వివాదానికి మతం అనే ఓ సహేతుక కారణం ఉంది. అలాగే భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ సమయంలోనూ రాజ్ పుత్ ల మనోభావాలు దెబ్బ తిని నానా రచ్చ అయ్యింది. ఇటీవలి కాలంలో అంత పెద్ద ఇష్యూ ఏదీ లేకపోయినా ఆ టైటిల్ లో మా కులం ఉందని.. ఈ టైటిల్ వల్ల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవడం సహజంగా మారింది. ఇందుకోసం ప్రత్యేకించి కొన్ని మూకలు ఇలాంటివాటిని ఎంకరేజ్ చేయడం కనిపిస్తోంది.
వీటన్నిటికీ అతీతంగా ఒక మాంసం కత్తికి కూడా మనోభావం దెబ్బ తింటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. ఇలయదళపతి విజయ్ నటిస్తున్న `బిగిల్` త్వరలో రిలీజ్ కి రాబోతోంది. ఆ క్రమంలోనే ఈ చిత్రం రకరకాల వివాదాలకు తావిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ పై మాంసం వ్యాపారాలు భగ్గుమన్నారు. మా వృత్తికి సంబంధించిన మనోభావాలను దెబ్బ తీశారు. ప్రొఫెషన్ ని కించపరిచే విధంగా పోస్టర్ ను డిజైన్ చేశారు అని విమర్శలు గుప్పించడమే గాక మాంసం వ్యాపారులు నానా యాగీ చేశారు.
మేం పొట్ట కూటి కోసం.. వృత్తి లో భాగంగా ఉపయోగించే కత్తిని విజయ్ తన కాళ్ల కింద పెట్టుకొన్నాడు. అలాగే మేము గౌరవంగా చూసుకొనే కత్తిని హత్యలకు.. నేరాలకు ఉపయోగించడం సరైనదేనా? అంటూ యుద్ధానికి దిగారు. బిగిల్ పోస్టర్లు చించి ఊరేగింపుగా రోడ్లకెక్కారు. తమిళనాడు ఉక్కడమ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దీంతో పీఎస్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకొంది. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంతింపజేయాల్సి వచ్చింది. 2019 దీపావళీకి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన నయనతార నాయిక. అట్లీ దర్శకుడు. యోగిబాబు, జాక్రీ ష్రాప్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే తమిళనాట హీరోలకు రాజకీయాలతో ఉన్న ప్రమేయం వల్ల ప్రతిదీ వివాదాస్పదంగా మారడం గమనించవచ్చు.