Begin typing your search above and press return to search.
టైగర్ కోసం కళ్లు చెదిరే మాసీవ్ సెట్
By: Tupaki Desk | 16 April 2022 10:42 AM GMTమాస్ మహారాజా రవితేజ మునుపెన్నడూ లేనంతగా స్పీడు పెంచేశారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస షాకులిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ చిత్రీకరణ పూర్తయి రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో రెండు చిత్రాలు రావణాసుర, ధమాకా చిత్రీకరణ దశలో వున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు రీసెంట్ గా మరో చిత్రాన్ని రవితేజ పట్టాలెక్కిచాడు. స్టూవర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
'టైగర్ నాగేశ్వరరావు' టైటిల్ తో రూపొందుతున్న ఈమూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కాబోతోంది. బయోపిక్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెగాస్టార్ క్లాప్ తో ఇటీవలే ఉగాది సందర్‌భంగా లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
క్రితిసనన్ సోదరని నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఈ చిత్రం కోసం 7 కోట్లతో స్టూవర్టు పురం విలేజ్ కి సంబంధించిన సెట్ ని నిర్మిస్తున్నారు.
70 వ దశకంలో స్టూవర్టు పురం ని హైదరాబాద్ లో రీక్రియేట్ చేస్తున్నారు. ఇందు కోసం సిటీ ఔట్ స్కర్ట్ లో వున్న శంషాబాద్ సమీపంలోని ఐదెకరాల స్థలంలో 70 వ దశకంలో స్టూవర్టు పురం ని ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల రీక్రియేట్ చేస్తున్నారు.
గతంలో ఈ ఆర్ట్ డైరెక్టర్ మహానటి, జెర్సీ, ఎవరు, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలకు వర్క్ చేసి ప్రశంసలు అందుకున్నారు. సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనున్న ఈ సెట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సెట్ లో కీలక ఘట్టాల చిత్రీకరణని దర్శకుడు ప్రారంభించనున్నారట. 70వ దశకంలో స్టూవర్ట్ పురం తెలుగు ప్రజల్లో సంచలనంగా నిలిచింది. ఇదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు రాబిన్ హుడ్ తరహాలో అప్పట్లో సంచలనాలు సృష్టించారు. ఇదే కథని ఇప్పడు రవితేజ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. సినిమా ప్రారంభం సందర్భంగా చేతిలో హంటర్ తో గోచీ పెట్టుకుని, మెడలో పులిగోరు ధరించి.. నెవర్ బిఫోర్ సీన్ మాసీవ్ అవతార్ లో రవితేజ కనిపించిన లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీతో హీరోగా పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకోవాలని రవితేజ చాలా పట్టుదలతో ఈ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష్, ఫొటోగ్రఫీ మదీ, మాటలు శ్రీకాంత్ విస్సా, ఫైట్స్ పీటర్ హెయిన్, రామ్ లక్ష్మణ్.