Begin typing your search above and press return to search.
వీడియో: కొండ కోనల్లో ఎమోషన్ రగిలించిన ధింసారే ధింసా
By: Tupaki Desk | 10 July 2021 12:15 PM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వారసుడు కార్తికేయ నిర్మిస్తున్న మూవీ ఆకాశవాణి. జక్కన్న శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కీరవాణి వారసుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రైసిస్ కాలంలో చిత్రీకరణ ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా వాయిదా పడింది.
త్వరలోనే రిలీజ్ కానున్న ఈ మూవీ కి ప్రమోషన్స్ తాజాగా ప్రారంభించారు. ధింసారే ధింసా అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ధింసా అనేది కొండ కోనల్లో కోయబృందాలు పాడుకునే పల్లె పట్టు పాట. కొండల్లో గిరిజనులు ఆడే ఒక ఆట ధింసా. అయితే దానినే ఎంతో స్టైలిష్ గా కొరియోగ్రాఫ్ చేశారు ప్రేమ్ రక్షిత్. అనంత శ్రీరామ్ లిరిక్ లో ఎమోషన్ కి తగ్గట్టే కాలభైరవ దరువు వర్కవుటైంది.
ఇక ఈ పాట విజువల్ గా మేకింగ్ చూస్తే ఆసక్తిని కలిగించింది. ఒక కొండ ప్రాంతంలో పచ్చని పరిసరాల్లో పాటను ఎంతో ఇంప్రెస్సివ్ గా రూపొందించారు. అనురాగ్ కులకర్ణి గానాలాపన ఆకట్టుకుంది. వేల్ రికార్డ్స్ ద్వారా పాటల్ని రిలీజ్ చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్ ఈ క్రేజీ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. డు.