Begin typing your search above and press return to search.

క‌ళ్లు చెదిరే అందంతో క‌వ్విస్తున్న మాస్ట‌ర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   12 Feb 2021 9:00 PM IST
క‌ళ్లు చెదిరే అందంతో క‌వ్విస్తున్న మాస్ట‌ర్ బ్యూటీ
X
పేట‌- మాస్ట‌ర్ లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది మాళ‌విక మోహ‌న‌న్. ఇంకా తెలుగు స్ట్రెయిట్ సినిమాలో న‌టించ‌క ముందే ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ ఎలివేష‌న్ అంద‌చందాలు న‌ట‌న‌పై యూత్ లో చ‌ర్చ సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఈపాటికే రౌడీ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించాల్సింది. కానీ కుద‌ర‌లేదు.

టాప్ సినిమాటోగ్రాఫర్ కెయు మోహనన్ కుమార్తెగా మాలవికా మోహనన్ క్రేజు అసాధార‌ణం. కానీ త‌న తండ్రి పేరును ఉప‌యోగించ‌డం కంటే సొంత ట్యాలెంట్ తోనే ఎదిగేందుకు మాళ‌విక ఇష్ట‌ప‌డుతోంది. త‌న‌కు తానుగానే ఇమేజ్ మేకోవ‌ర్ కి ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో నిరంత‌ర ఫోటోషూట్ల‌తో మాళ‌విక అగ్గి రాజేస్తూనే ఉంది. ఇటీవ‌ల‌ మాళ‌విక‌ హాట్ పోజులు విస్తృతంగా వైర‌ల్ అయ్యాయి.

ఇటీవ‌లే విజయ్ స‌ర‌స‌న‌ `మాస్టర్` చిత్రంతో ఆక‌ట్టుకుంది. ప్రస్తుతం ధనుష్ తో కలిసి సినిమా చేస్తోంది. ఈలోగానే ఇలా ఇన్ స్టాలో ట‌చ్ లోకి వ‌చ్చింది. చీరలో హాట్ లుక్ తో అగ్గి రాజేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. మాళ‌విక టూమ‌చ్ సెక్సీ!! అంటూ యూత్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. మాళ‌విక మోహనన్ త్వరలో హిందీ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టడానికి ఆసక్తి గా ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు ఫిలింమేక‌ర్స్ త‌న‌కు క‌థ‌లు వినిపించార‌ని తెలుస్తోంది.