Begin typing your search above and press return to search.

మాస్టర్ విషయంలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ కీలకమైందా..??

By:  Tupaki Desk   |   5 Jan 2021 7:43 AM GMT
మాస్టర్ విషయంలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ కీలకమైందా..??
X
ఇళయదళపతి విజయ్ తమిళనాడు ప్రభుత్వాన్ని థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ రేటును అనుమతించాలని కోరిన మరుసటి రోజే అనుమతి లభించింది. ప్రస్తుత కరోనా సమయంలో, థియేటర్లకు వచ్చే జనాలు లాక్ డౌన్ నిబంధనలు పాటించేలా తగిన చర్యలు తీసుకోవల్సిన బాధ్యత థియేటర్ యజమానులతో పాటు సినీ నిర్మాతలపై కూడా ఉంది. తాజాగా వారి బాధ్యతలను సులభతరం చేస్తూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి.. సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటోంది. అంతేగాక నెటిజన్లతో పాటు ఇండస్ట్రీ వారిని కూడా ఆకర్షిస్తోంది. దళపతి విజయ్ డై-హార్డ్ అభిమాని సృష్టించిన ఈ పోస్టర్ థియేటర్లలోకి ప్రవేశించే ముందు, థియేటర్లలో ఉన్నప్పుడు, సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు తీసుకోవలసిన చర్యలను స్పష్టంగా వివరిస్తుంది.

ఈ పోస్టర్ ‘మాస్టర్’ సినిమా ఎంజాయ్ చేయాలంటే మూడు నియమాలు తప్పనిసరి అని సూచిస్తుంది. అందులో మొదటిది మాస్కులు ధరించడం, రెండు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం, ఇక మూడోది థియేటర్లో సినిమా చూస్తూ ఈలలు, కేకలు వేయకూడదు. ఇందులో మొదటి రెండు నియమాలు థియేటర్లలోకి ప్రవేశించే ముందు పాటించాలి. కానీ మూడవది ప్రస్తుత పరిస్థితులలో చాలా ముఖ్యం. ఎందుకంటే హీరో ఎలివేషన్ సీన్స్ రాగానే డై-హార్డ్ అభిమానులు విజిల్స్, కేకలు వేస్తారు. అది చాలా డేంజర్ అంటూ చెప్పకనే చెబుతోంది పోస్టర్. ఈ పోస్టర్ మాస్టర్ సినిమాకు పర్ఫెక్ట్ కామన్ డీపీ అంటూ అభినందిస్తున్నారు. జనవరి 13న విడుదల కాబోతున్న మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్ లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. చూడాలి మరి ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాస్టర్ విషయంలో ఎలా సహకరిస్తుందో..!!