Begin typing your search above and press return to search.

అమ్మ బాబోయ్​.. చిరు మాస్టర్​ హీరోయిన్​ ఇలా అయిపోయిందేంటి

By:  Tupaki Desk   |   2 Feb 2023 7:00 AM GMT
అమ్మ బాబోయ్​.. చిరు మాస్టర్​ హీరోయిన్​ ఇలా అయిపోయిందేంటి
X
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్​గా రాణించిన చాలా మంది భామలు ఇప్పుడు పూర్తిగా సినిమాలకు టాటా చెప్పేశారు. వారిలో కొంతమంది అసలు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు. పూర్తిగా కనుమరుగైపోయారు. వారందరినీ మనం మర్చిపోయాం కూడా. అయితే కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్​ ప్రారంభించడంతో వారిని గుర్తుపడుతున్నాం. కానీ కొంతంది అస్సులు జాడేలేదు. అలా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్​గా వెలిగిన భామల్లో సాక్షి శివానంద్ ఒకరు. అప్పట్లో తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ భామ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో అగ్రహీరోలైనా మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, మహేశ్‌ బాబు, రాజశేఖర్‌ సరసన నటించి ఆకట్టుకుంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత సీతారామరాజుతో కనువిందు చేసింది. అనంతరం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. అలా బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్​తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది.

నాగార్జున, మహేశ్​బాబుతో కలిసి కూడా సినిమాలు చేసింది. అలా తక్కవ సమయంలో స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ఆ తర్వాత తన పూర్తి ఫోకస్​ తమిళ, కన్నడ ఇండస్ట్రీలపైనే పెట్టింది. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే 2008లో జగపతిబాబు నటించిన హోమం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె స్పెషల్​ సాంగ్‌తో ఆడియెన్స్​ను అలరించింది. ఆ తర్వాత 2010లో శ్రీకాంత్ నటించిన రంగ ది దొంగ సినిమాలో నటించింది. తెలుగులో చివరి చిత్రం ఇదే. ఆ తర్వాత ఆమె మరే సినిమాల్లో నటించలేదు.

అనంతరం ఏమైందో ఏమో సడెన్‌గా పెళ్లి చేసుకొని సినిమాలకు వీడ్కోలు పలికింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇటీవల ఆమె లేటెస్ట్‌ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో సాక్షి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయిపోయిందేంటి, ఇంకా భలే అందంగా ఉందిగా, అదే అందం ఏ మాత్రం తగ్గలే కాస్త వయసు పెరిగింది అని అభిప్రాయపడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.