Begin typing your search above and press return to search.
వీడియో: 'మాస్టర్' నుంచి 'కుట్టి స్టోరీ' తెలుగు వర్షన్ 'చిట్టీ స్టోరీ' సాంగ్..!
By: Tupaki Desk | 25 Dec 2020 10:54 AM GMT'ఇళయదళపతి' విజయ్ హీరోగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి విలన్ గా నటించిన మూవీ ''మాస్టర్''. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్ పై జేవియర్ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో విజయ్ కాలేజ్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించగా ఆండ్రియా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా తెలుగులో 'మాస్టర్' టైటిల్ తో రాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. ఇటీవల తెలుగు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ క్రమంలో తాజాగా 'మాస్టర్' చిత్రం నుంచి 'చిట్టీ స్టోరీ' లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ తమిళంలో స్వరపరిచిన 'కుట్టి స్టోరీ' సాంగ్ కి తెలుగు వర్షన్ గా 'చిట్టీ స్టోరీ' పాట తీసుకొచ్చారు. జీవితానికి సంబంధించిన పాఠాలను యానిమేషన్ విజువల్స్ తో చూపించారు. లెక్చరర్ అయిన విజయ్ తన స్టూడెంట్స్ కి జీవిత పాటలను సాంగ్ రూపంలో భోదిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించారు. ఈ పాటను అనిరుధ్ సామ్ విశాల్ తో కలిసి ఆలపించారు. ఈ సాంగ్ అనిరుధ్ కంపోజిషన్ లో ఇంతకముందు వచ్చిన 'వై దిస్ కొలవేరిడీ' సాంగ్ ని గుర్తుకు తెస్తుంది. సాహిత్యం కూడా అదే విధంగా ఇంగ్లీష్ తెలుగు పదాల కలయికలో వచ్చేలా చూసుకున్నారు. ఈ సినిమాని తెలుగులో ప్రమోట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడే సాంగ్ అనిపిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన 'మాస్టర్' చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్.. ఇప్పుడు విజయ్ సేతుపతి తో కలిసి చేసిన 'మాస్టర్' సినిమాతో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.