Begin typing your search above and press return to search.
అక్కడ కూడా ఇద్దరు సూపర్ స్టార్స్ చేయబోతున్నారట!
By: Tupaki Desk | 4 Jan 2022 11:30 PM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'మాస్టర్' సినిమా సరిగ్గా ఏడాది క్రితం అంటే గత ఏడాది జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సమయంలో కరోనా భయం కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా కూడా జనాలు భారీ ఎత్తున చూసి మాస్టర్ కు మంచి వసూళ్లను ఇచ్చారు. తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మాస్టర్ సినిమాకు 250 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈమద్య కాలంలో సౌత్ లో ఇలా భారీ విజయాలను దక్కించుకున్న సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్ ఉన్న ఏ ఒక్క సినిమాను కూడా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వదలకుండా రీమేక్ చేస్తున్నారు. అందులో భాగంగా మన సౌత్ మాస్టర్ ను కూడా రీమేక్ చేయబోతున్నారు.
మాస్టర్ రీమేక్ కు సంబంధించిన ఒప్పందాలు జరిగి చాలా నెలలు అవుతుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమాకు సంబంధించిన హడావుడి కనిపిస్తుంది. మాస్టర్ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న మేకర్స్ అనధికారికంగా సినిమాను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నట్లుగా తెలియజేశారు. ఇదే సమయంలో హిందీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలను ఈ సినిమాలో నటింపజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఈ నెల చివరి వరకు ఆ విషయాన్ని రివీల్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మాస్టర్ సినిమా కు హిందీ దర్శకుడు ఎవరు అనే విషయంలో కూడా మరి కొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని అంతా ఆశిస్తున్నారు.
తమిళంలో మాస్టర్ ను సూపర్ స్టార్ విజయ్ మరియు మరో స్టార్ విజయ్ సేతుపతి కలిసి చేశారు. విజయ్ హీరోగా నటించగా విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న మాస్టర్ హిందీ వర్షన్ ను 2023 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారట. తెలుగు లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మాస్టర్ కథకు భాష తో సంబంధం లేదు.. యూనివర్శిల్ సబ్జెక్ట్ అని నిరూపించుకుంది. అందుకే ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని బాలీవుడ్ లో కూడా దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. మరి ఈ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకోబోతున్న ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ ఎవరై ఉంటారో చూడాలి.