Begin typing your search above and press return to search.
ఆరవరోజు కూడా మాస్టర్ రికార్డు కలెక్షన్స్.. ఇప్పటివరకు?
By: Tupaki Desk | 19 Jan 2021 12:17 PM ISTఇళయదళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రదారులుగా నటించిన సినిమా మాస్టర్. గతేడాది నుండి ఈ సినిమా విడుదల గురించి కోలీవుడ్ సినీ అభిమానులు ఆసక్తిగా, ఓపికగా ఎదురుచూసారు. ఇప్పుడు ఆ వెయిటింగ్ చేసిన దానికి ప్రతిఫలం మాస్టర్ సినిమా ఖాతాలో వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 13న విడుదలైన మాస్టర్.. విడుదలైన రోజు నుండి వసూళ్లపరంగా అసలు తగ్గడం లేదట. ఇప్పటికే సినిమాకు విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లభించిన సంగతి తెలిసిందే. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డార్క్ మెసేజ్ యాక్షన్ సినిమా.. తమిళనాడుతో పాటు విడుదలైన అన్ని రాష్ట్రాలలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. మాస్టర్ జాన్ పాత్రలో విజయ్.. విలన్ భవాని పాత్రలో విజయ్ సేతుపతి ఇద్దరూ కూడా సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని చెప్పవచ్చు.
అయితే ఫస్ట్ డే కాస్త నెగటివ్ టాక్ వచ్చినా మాస్టర్ సినిమా కలెక్షన్స్ మాత్రం అదరగొడుతుందట. ఇక ప్రస్తుతం పైసావసూల్ మూవీ అనిపించుకుంది మాస్టర్. కేవలం తమిళనాడులోనే 550 పైగా స్క్రీన్స్, అలాగే ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్ల పైగా భారీ రేంజిలో విడుదలైన మాస్టర్ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తుందట. తాజాగా ట్రేడ్ అంచనా ప్రకారం మాస్టర్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాస్టర్ కేవలం తమిళనాడు వరకే మూడు రోజుల్లో యాభై కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ ఆరు రోజుల కలెక్షన్స్ చూస్తే మాస్టర్ 150కోట్లు మార్క్ దాటిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. లాక్ డౌన్ తర్వాత తమిళనాడు లోనే 100% సీటింగ్ అనుమతి లభించింది. ఇక మిగతా రాష్ట్రాలన్నీ 50% సీటింగ్ తోనే థియేటర్లు రన్ చేస్తున్నాయి. ఆరు రోజులు గడిచినా మాస్టర్ హవా ఇంకా తగ్గలేదంటే రికార్డే అనవచ్చు.