Begin typing your search above and press return to search.

యావరేజ్ టాక్‌ తో స్క్రీనింగ్‌ స్ట్రీమింగ్ లోనూ సూపర్‌ హిట్‌

By:  Tupaki Desk   |   2 Feb 2021 7:07 AM GMT
యావరేజ్ టాక్‌ తో స్క్రీనింగ్‌ స్ట్రీమింగ్ లోనూ సూపర్‌ హిట్‌
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగ రాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్‌ సినిమా కు యావరేజ్ టాక్ వచ్చింది. అయినా కూడా సినిమా వసూళ్ల పరంగా రికార్డు సృష్టించింది. దాదాపుగా 200 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది. రెండు వారాల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేయడంతో పాటు ఓటీటీలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో స్క్రీనింగ్ అయిన 16 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ చేశారు. మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ అయిన మాస్టర్‌ కు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్ల విషయంలో మరియు స్ట్రీమింగ్ విషయంలో కూడా రికార్డు బ్రేక్‌ చేసింది.

మాస్టర్ సినిమా తెలుగు మరియు తమిళంలో ఈ సినిమా అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. మొదటి రోజు ఈ సినిమా 9.2 మిలియన్‌ ల మంది చూశారు. మొదట మూడు రోజుల్లోనే ఈ సినిమాను ఏకంగా 28 మిలియన్ ల వ్యూస్ ను అమెజాన్‌ ద్వారా దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మాస్టర్‌ సినిమా ఓటీటీ లో కూడా భారీ వ్యూస్ ను దక్కించుకోవడంతో మళ్లీ అక్కడ కూడా హిట్‌ అనిపించుకుంది. ఇక శాటిలైట్ విషయంలో ఏ రేంజ్ లో సక్సెస్ ను దక్కించుకుంటుందో చూడాలి. మాస్టర్‌ సినిమా ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ వచ్చాయి. అయినా కూడా వసూళ్లు మరియు డిజిటల్ వ్యూస్‌ మాత్రం భారీగా ఉన్నాయి.