Begin typing your search above and press return to search.
సొంత ప్రాంతంపై లెక్కల మాస్టర్ అభిమానం
By: Tupaki Desk | 23 May 2021 5:30 AM GMTకరోనా విపత్కార పరిస్థితుల్లో సినీ ప్రముఖులు ఎంతో మంది తమకు తోచిన సాయంను అందిస్తున్నారు. లక్షలు.. కోట్ల సాయంను ప్రభుత్వానికి స్వచ్చంద సంస్థలకు సినీ రంగ ప్రముఖులు విరాళంగా ఇస్తున్నారు. మరి కొందరు సొంతంగా ఆ డబ్బును కరోనా విపత్తు సమయంలో స్వయంగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. లెక్కల మాస్టర్ సుకుమార్ తన సొంత ప్రాంతంలో కరోనాపై పోరాటంకు తనవంతు సాయంను అందిస్తూనే ఉన్నారు. గత ఏడాది భారీ విరాళంను అందించి పేదలకు రేషన్ సరుకులు పంచడం నుండి మొదలుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా తన సొంత ప్రాంతంలోని ఆక్సీజన్ కొరతను తీర్చుతున్నాడు.
తన స్వస్థలం రాజోలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్సీజన్ కొరత తీర్చేందుకు గాను ఒక మినీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యాడట. అక్కడి స్నేహితులతో కలిసి దాదాపుగా 40 లక్షల రూపాయలను ఖర్చు చేసి ఈ పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆక్సీజన్ అందక ఇటీవల చాలా మంది మృతి చెందుతున్న నేపథ్యంలో సుకుమార్ చేసిన పనితో రాజోలు చుట్టు పక్కల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఎప్పుడు అండగా ఉంటూ తన దాతృత్వంను చాటుకుంటున్న సుకుమార్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇక సుకుమార్ ప్రస్తుత సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను రెండు పార్ట్ లు గా విడుదల చేయబోతున్నారట. కరోనా వల్ల షూటింగ్ తాత్కాలికంగా నిలిచి పోయింది. త్వరలో మళ్లీ ఈ సినిమా ను పునః ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. బన్నీకి జోడీగా ఈ సినిమా లో రష్మిక మందన్నా నటిస్తుండగా మలయాళ స్టార్ నటుడు ఫాహద్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మొదటి పార్ట్ ఈ ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది.