Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి విజయ్ ‘మాస్టర్’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   20 Jan 2021 8:43 AM GMT
ఓటీటీలోకి విజయ్ ‘మాస్టర్’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
X
తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. చాలాకాలం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఫ్యాన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్'.. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగింది. ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. విజయ్ హీరోగా నటించడంతోపాటు విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో ‘మాస్టర్'కు ఊహించని రీతిలో మార్కెట్ జరిగింది. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల్లోనూ ఈ మూవీ రిలీజ్ అయింది.

అయితే.. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లు సాధించిందీ చిత్రం. తెలుగు రాష్ట్రాలలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. తాజాగా.. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ కొనేసింది. అమెజాన్ ప్రైమ్ భారీ ధర చెల్లించి అన్ని భాషల హక్కులనూ సొంతం చేసుకుంది.

ఇక, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12 నుండి స్ట్రీమ్ చేయనున్నట్టు ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. 13, 14 వీకెండ్ కావడమే కాకుండా.. ప్రేమికుల దినోత్సవం రూపంలో తిరుగులేని సందర్భం ఎదురైంది. అందుకే ఈ డేట్ ను ఫిక్స్ చేశారు. సరిగ్గా థియేట్రికల్ రిలీజైన నెల తర్వాత డిజిటల్ రిలీజ్ కాబోతోంది మాస్టర్ మూవీ.