Begin typing your search above and press return to search.
కెజిఎఫ్ రెండు చాప్టర్ల వెనుక మాస్టర్ బ్రెయిన్ ?
By: Tupaki Desk | 22 Dec 2018 11:08 AM GMTకన్నడ స్టార్ హీరో యష్ తో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ కేజిఎఫ్ నిన్న తీవ్రమైన పోటీ మధ్య అరకోటి పైగా షేర్ తెచ్చుకుని ఆశ్చర్యపరిచింది. కంటెంట్ మీద యూనానిమస్ గా పాజిటివ్ టాక్ లేదు కానీ మొదటి నుంచి దీని బిల్డప్ ని అనుసరిస్తూ వచ్చిన వారికి ఓసారైనా చూడాలనే ఆసక్తిని రేకెత్తించింది. ఈ మాత్రం డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి అంటే అదే కారణం. అయితే కథ పెద్దగా లేకుండా 2 గంటల 40 నిమిషాల సేపు ఎందుకు నడిపారు అనే సందేహం అయితే అందరికి వచ్చింది. బాహుబలి లో కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న తరహాలో కెజిఎఫ్ లో రాకీ దేశ ప్రధానినే తన గురించి ఆలోచించే స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే సందేహం మిగిలిపోయింది.
దానికి సమాధానంగా జర్నలిస్ట్ పాత్ర వేసిన అనంత్ నాగ్ పాత్ర ద్వారా ఇక అసలు కథ మొదలవుతుంది మిగిలింది రెండో భాగంలో చూడండి అని చెప్పించడం ద్వారా ఇప్పటిదాకా మీరు చూసినదంతా పాత్రల పరిచయమే అని కుర్చీలో లేచే సమయంలో చల్లగా చెప్పారు. అయితే కెజిఎఫ్ ఇలా రెండు భాగాలుగా మలచడం వెనుక ఓ మాస్టర్ బ్రెయిన్ ఉందని బెంగుళూరు టాక్. అది నిజమో కాదో కన్ఫర్మేషన్ లేదు కానీ నమ్మేలాగే ఉంది. కెజిఎఫ్ ఐడియా ను ఇంత భారీ బడ్జెట్ లో రూపొందించాలి అనుకున్నప్పుడు ముందు ఒక భాగానికే స్క్రిప్ట్ రాసుకున్నారట. మొత్తం 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చింది. యాష్ బాల్యం నుంచి అతను ఆర్మీ చేతిలో హతమయ్యే దాకా మొత్తం అందులోనే వచ్చేలా ప్లాన్ చేశారట. అయితే బడ్జెట్ చేయి దాటిపోవడంతో ఒకేసారి అంతా రికవర్ చేయలేమని గుర్తించి వారాహి సాయి కొర్రపాటి మధ్యవర్తిత్వం తో దర్శకుడు ప్రశాంత్ నీల్ రాజమౌళిని కలిశాడట.
అక్కడే బాహుబలి తరహాలో ఒకేసారి మూడు గంటల సినిమాగా కాకుండా స్క్రిప్ట్ ని విస్తరించి రెండు భాగాలుగా విడుదల చేస్తే సేఫ్ అవుతామని చెప్పడంతో చాలా మార్పులు చేశారట. అందుకే చాప్టర్ వన్ లో అవసరం లేకపోయినా చైల్డ్ హుడ్ సీన్స్ పదే పదే రావడం హీరోని అదే పనిగా ఎలివేట్ చేయడం హీరోయిన్ ట్రాక్ ఇరికించినట్టు అనిపించడం ఇవన్నీ ఇందులో భాగంగా జరిగిన మార్పులే అని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ ఈ స్ట్రాటజీ కన్నడ లో బాగా వర్క్ అవుట్ అవుతోంది. యష్ ఇమేజ్ కి తోడు ఇలాంటి ప్రయత్నం శాండల్ వుడ్ జరగలేదన్న ఫాక్టర్ భారీ వసూళ్లను దక్కిస్తోంది. అప్పుడే చాప్టర్ 2 డిమాండ్ పెరిగిందని టాక్. అయితే ఇలాంటి సినిమాలు ఎన్నో చూసిన తెలుగు ప్రేక్షకులు దీని పట్ల అంత ఎగ్జైట్ కావడం లేదు. అయినా కూడా దీని ఫలితం వెనుక ఉన్నది తెలుగు వాడి బ్రెయినే కదా. ఇది గాసిప్పే కావొచ్చు లేదా నిజాలే ఉండొచ్చు. ఏదైతేనేం జక్కన్న ఫ్యాన్స్ మాత్రం గర్వంగా ఫీలవుతున్నారు..