Begin typing your search above and press return to search.
టీజర్ తో దుమ్మ రేపిన సూపర్ స్టార్ ట్రైలర్ రెడీ
By: Tupaki Desk | 7 Dec 2020 5:06 AM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ 'మాస్టర్' సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో విజయ్ తో పాటు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించడమే సినిమాపై ఉన్న అంచనాలకు కారణం అంటున్నారు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రూపొందిన 'మాస్టర్' సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రమోషన్ పనులు మొదలు పెట్టారు.
వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేసే ఉద్దేశ్యంతో ఇప్పటికే టీజర్ ను విడుదల చేశారు. టీజర్ కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వచ్చాయి. లైక్స్.. వ్యూస్ ఇలా అన్ని విధాలుగా ఆ టీజర్ రికార్డులను నమోదు చేసింది. అదే జోష్ తో ఇప్పుడు మాస్టర్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి నెలలో మాస్టర్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారట. ట్రైలర్ రచ్చ మరింత ఎక్కువ ఉండటం ఖాయం అని విజయ్ అభిమానులు ఇప్పటి నుండే అంటున్నారు. రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తో మరోసారి మాస్టర్ ను టాప్ లో పెట్టాలని.. లైక్స్ విషయంలో బాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నేలా మాస్టర్ కు రికార్డును కట్టబెట్టాలని విజయ్ అభిమానులు ఆరాటపడుతున్నారు.