Begin typing your search above and press return to search.
మే 29.. టాలీవుడ్‌కు పండగే పండుగ
By: Tupaki Desk | 24 May 2015 10:30 PM GMTఒక్కోసారంతే.. సెంటిమెంట్లతై సస్యశామలమైన టాలీవుడ్‌లో ఏదో ఒక అద్భుత ముహూర్తం దొరగ్గానే అందరూ అటువైపే పరిగెడతారు. ప్రస్తుతం అందరూ ఇదే టైపులో మే 29 అనే డేట్‌పై కన్నేశారు. రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ రోజు ఐదు వడ్డనలు మన ముందుకు రాబోతున్నాయ్.
ముందుగా కొత్త సినిమాల లాంచింగ్ విషయంలో చూసుకుంటే.. మే 29న నందమూరి బాలకృష్ణ ''డిక్టేటర్'' లాంబ్ కాబోతుంది. ఆయన 99వ సినిమా కదా, కాస్త గ్రాండ్‌గానే ఉంటుందిలే. ఇకపోతే సేమ్ డే పవర్‌స్టార్ కూడా గబ్బర్ సింగ్ 2 షూటింగ్‌ను పూణె దగ్గర్లోని ఓ పల్లెటూరులో స్టార్ట్ చేస్తారని టాక్. ఇవి రెండూ కనుక నిజంగానే మొదలైతే ఇక అభిమానులకు పండగే మరి. బాలయ్య ష్యూర్ కాని, పవన్ విషయంలోనే క్లారిటీ లేదు.
కట్ చేస్తే.. రిలీజ్‌లున్నాయి చూడండి.. వామ్మో ఊరిస్తున్నారు. ఒక ప్రక్కన హీరో రామ్ పండగ చేస్కో అంటూ ఇద్దరు హీరోయిన్లతో మసాలా కర్రీ వడ్డిస్తుంటే.. మరో ప్రక్కన రాక్షసుడుగా హీరో సూర్య బిరియాని పెడుతున్నాడు. వీళ్లిద్దరూ ఇలా ఉంటే.. కొత్తదనం కోరుకునే వారికి కొత్త పిజ్జా అన్నట్లు నారా రోహిత్ అసుర తో వస్తున్నాడు.
మొత్తానికి ఐదు వడ్డనలు మరి తెలుగు ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో కడుపునింపుతాయో చూడాల్సిందే. అందరూ మూకుమ్మడిగా మే 29నే ఎటాక్ చేస్తున్నారు.. కాస్కోండి